English   

ఇంతా చేసి నీవెవరో రీమేకా..?

Aadhi-Pinisetty
2018-07-16 11:54:47

కోన వెంకట్ కొత్త అవతారం ఎత్తి చాలాకాలమైంది. కొత్త సినిమాలు సమర్పించడం.. కొత్త రచయితల నుంచి కథలు తీసుకుని వాటిని మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో అమ్మేయడం.. ఇదీ ఇప్పుడు పెన్ పక్కన బెట్టి కోన చేస్తోన్న కొత్త బిజినెస్. ఇది బానే లాభసాటిగానే ఉంది. ఈ నేపథ్యంలో అతను మరో సినిమాకు సమర్పకుడిగా ఉన్నాడు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ నటిస్తోన్న ఈ మూవీ పేరు నీవెవరో. గత కొన్ని రోజులుగా ఈ మూవీ గురించి కోన తెగ ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ టీజర్ విడుదల చేశారు. ముందుగా గోవాలో విడుదల చేస్తాం అన్నారు. కానీ వెదర్ సహకరించలేదని చెప్పిన టైమ్ కంటే కాస్త లేట్ గా రిలీజ్ చేశారు. అయితే ఇన్నాళ్లూ కాస్టింగ్ బావుందనీ.. కథ సూపర్ అనీ చెప్పుకుందీ మూవీ టీమ్.. కానీ తీరా టీజర్ చూశాక చేస్తోంది ఓ రీమేక్ అని తేలిపోయింది. అవును ఈ ఇది ఓ తమిళ సినిమా రీమేక్. ఆ తమిళ సినిమా పేరు ‘అదే కన్ గల్’.అంటే అవే కళ్లు అని అర్థం. ఇది కూడా డోలీకి డోలీ అనే బాలీవుడ్ సినిమా ఆధారంగా వచ్చిందే. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో ‘నీవెవరో’గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఇది తమిళ్ లో మంచి హిట్ సాధించిన సినిమా. 

హీరోకు కళ్లుండవు. ఓ యాక్సిడెంట్ తర్వాత కళ్లు వస్తాయి. కానీ అంతకు ముందు జరిగింది యాక్సిడెంట్ కాదు హత్య అని తెలుస్తుంది. ఆ హత్య చుట్టూ జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటనల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అంతకు ముందే ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. ఒకరకంగా ఇది రొమాంటిక్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. కాకపోతే తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. రంగస్థలం తర్వాత ఆది పినిశెట్టి సోలోగా చేస్తోన్న సినిమా ఇది. ఇక అతని సరసన తాప్సీ చేస్తోన్న రెండో సినిమా. రితికా సింగ్ ఫస్ట్ టైమ్ యాక్ట్ చేసింది. వెన్నెల కిశోర్ కు కూడా ఒరిజినల్ సినిమాను బట్టి చూస్తే ప్రాధాన్యం ఉన్న పాత్రే. మొత్తంగా కోన వెంకట్ కొత్త సినిమా చేస్తున్నాడు అనుకుంటే తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఆదికి ఎలాంటి టర్న్ ఇస్తుందో చూడాలి. 
 

More Related Stories