English   

ఆది పినిశెట్టి.. ఆ కళ్లేంటీ గురూ

Aadhi Pinisetty U Turn Movie First Look Released
2018-08-04 07:04:33

ఆది పినిశెట్టి.. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరుంది. కానీ అనుకున్న టైమ్ లో బ్రేక్ రాలేదు. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అతను దూసుకుపోతున్నాడు. రంగస్థలం తర్వాత ఆదికి తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత అదే పంథాలో పాత్రలు ఎంచుకోవడం లేదు. వైవిధ్యమైన పాత్రలకు ఓటేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతను రెండు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ఒకటి నీవెవరో.. ఇందులో అతను అంధుడుగా నటిస్తున్నాడు. అలాగే సమంత నిర్మిస్తోన్న యూ టర్న్.. ఇదీ కూడా డిఫరెంట్ మూవీనే.

యూ టర్న్ ఓ కన్నడ సినిమా. మూడేళ్ల క్రితమే వచ్చిన సినిమా. అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాపై ఎఫ్పుడో మనసుపడ్డ సమంత తెలుగులో దీనని రీమేక్ చేస్తోంది. దర్శకుడు కూడా ఒరిజినల్ అతనే. పేరు పవన్ కుమార్. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టిది ఓ కీలక పాత్ర. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఆది కళ్లు చూడాలంతే. ఆ కళ్లలో వందల భావాలు పలుకుతున్నాయి. ఈ ఎక్స్ ప్రెషన్ చాలు.. అతనెంత గొప్ప నటుడో చెప్పడానికి. ఇంతకు ముందు సమంత లుక్ కు ఎక్స్ టెన్షన్ లా అనిపించినా.. ఆ కళ్లలో ఉన్న ఇంటెన్సిటీ ఎంత చూసినా తక్కువే అన్నట్టుగా ఉంది. మొత్తంగా ఈ యూ టర్న్ ఆది పినిశెట్టి కెరీర్ కు కొత్త టర్న్ ఇచ్చే సినిమా అని సమంత కూడా ముందు నుంచీ చెబుతోంది. అది నిజమే అనడానికి ఈ లుక్ ఓ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది.

More Related Stories