English   

చిట్టిబాబు అన్న సింపేశాడు..?

Aadhi-Pinishetty

రామ్ చరణ్, సుకుమార్, సమంత.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ.. రంగస్థలం. 1980ల నాటి కథాంశంతో తెరకెక్కినఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథనంతో సుకుమార్ మరోసారి ప్రేక్షకుల్ని ఆ కాలానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు టీజర్, సాంగ్స్ చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ మూవీ కథపై ముందు నుంచి కొన్ని రూమర్స్ వినిపించాయి. రామ్ చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు. చిట్టిబాబు అన్నను ఎవరో చంపేస్తారు. వారిపై రివెంజ్ తీర్చుకోవడమే కథ అనేది చాలామంది చెబుతోన్న మాట. అయితే లేటెస్ట్ గా వదిలిన ఈ ఫస్ట్ లుక్ అందుకు బలం పెంచుతున్నట్టుగా ఉంది. బట్ ఏ మాటకామాటే ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ మాత్రం సూపర్బ్. 

1980ల కాలంలో గ్రామీణ రాజకీయాలు కాస్త మోటుగా ఉండేవని అందరికీ తెలుసు. హత్యారాజకీయాలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఈ క్రమంలో కుమార్ బాబు అనే ఓ చదువుకున్న కుర్రాడు ఊరి సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉంది. ఆ పాత్రలో నటిస్తున్నది ఆది పినిశెట్టి. రంగస్థలం గ్రామ పంచాయితీ ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె కుమార్ బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి. ఇది పోస్టర్. కింద కుమార్ బాబు ఫోటో.. లాంతరు గుర్తు. ఇవన్నీ గ్రామీణ రాజకీయాల్లో నేటికీ చూస్తున్నాం. మొత్తంగా చిట్టిబాబుకు చెవులు వినిపించవు. ఆ కారణంగా పెద్దగా చదువుకోలేదు. మాస్ గా ఉంటాడు. కుమార్ బాబు బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. సో.. ఇప్పుడు రంగస్థలం కథ రసకందాయంలో పడింది. మరి ఈ కథను సుకుమార్ నెరేట్ చేసే విధానమే రంగస్థలాన్ని నిలబెడుతుందనేది వేరే చెప్పక్కర్లేదు. 

More Related Stories