ఆది సాయికుమార్ శశి రిలీజ్ డేట్ మార్పు..మార్చి 19న

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆది, 'శశి' సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ ప్రేక్షకులను మన్నలను పొంది యూట్యూబ్ లో దూసుకుపోతుంది. నాయుడు నడికట్ల దర్శకత్వంలో లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సంక్రాంతి సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా విడుదల తేదిని మార్చి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి 12న కాకుండా మార్చి 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన శశి టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్లో ఆది సరికొత్తగా కనిపిస్తున్నాడనీ, అతనికి ఈ సినిమా బ్రేక్ నిస్తుందనే నమ్మకం కలుగుతోందనీ చెప్పడంతో పాటు, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతోందనీ చిరంజీవి ప్రశంసించారు.