English   

ఈ మూడో హీరోయిన్ అయినా ఉంటుందా నాగ్...?

Aakanksha-Singh
2018-04-12 18:33:00

సినిమా అంటే సినిమానే. ఒక సినిమాలో ఉన్న రిలేషన్ మరో సినిమాకు అక్కర్లేదు. అందుకే తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వారి కొడుకులతో కూడా రొమాన్స్ చేశారు. ఈ ట్రెండ్ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటుందనేది నిజం. లేటెస్ట్ గా అల్లుడు రొమాన్స్ చేసిన ఓ క్యూట్ బ్యూటీతో మామ యాక్ట్ చేయబోతున్నాడు. ఫస్ట్ మూవీకి హిట్ టాక్ వచ్చినా.. ఆ భామ నటనకు మంచి మార్కులు పడ్డా మనాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సడెన్ గా ఈ కొత్త ఆఫర్ కి తను వెంటనే యస్ చెప్పే చాన్సులున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. సుమంత్ సరసన మళ్లీరావా సినిమాలో నటించిన ఆకాంక్ష సింగ్. యస్.. తనిప్పుడు నాగార్జున సరసన నటిచంబోతోందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నాగ్ సరసన ఈ ఆకాంక్షనే అనుకుంటున్నారు. నిజానికి ఈ పాత్రకు ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. ఆల్మోస్ట్ ఫైనల్ అని చెప్పిన తర్వాత ఆ ఇద్దరూ డ్రాప్ అయ్యారు. వీరిలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ను ముందుగా అనుకున్నారు. తను కూడా నిజమే అంది. కానీ ఎందుకో తర్వాత డ్రాప్ అయింది. రీసెంట్ గా అమలాపాల్ ను అనుకున్నారు. తనూ నేను చేస్తున్నా అంది. మరి ఏమైందో కానీ అమలా పాల్ కూడా లేటెస్ట్ గా కుదరడం లేదు అనేసింది. దీంతో ఈ ఆకాంక్ష సింగ్ ను తీసుకోవాలనుకుంటున్నారు. చూడ్డానికి క్యూట్ బ్యూటీలా కనిపిస్తోన్నా ఆకాంక్ష ఆల్రెడీ మూడు పదుల వయసుకు దగ్గర్లో ఉంది. పైగా పెళ్లైంది కూడా. అందుకే నాగ్ సరసన పెద్దగా ప్రాబ్లమ్ ఉండదనుకున్నారని టాక్. త్వరలోనే  ఈప్రాజెక్ట్ లోకి ఆకాంక్ష సింగ్ ఎంట్రీపై అఫీషియల్ న్యూస్ రాబోతోంది. మరి ఈ మూడో హీరోయిన్ అయినా ఉంటుందా లేక మరో భామకోసం వెదకాలా..?

More Related Stories