English   

పాపం అమీర్ ఖాన్ కు అక్క‌డ కూడా చుక్క‌లే క‌నిపించాయిగా..

Aamir Khan's Thugs of Hindostan movie collections in china
2019-01-06 17:07:11

అమీర్ ఖాన్ సినిమాలకు ఇండియన్ మార్కెట్ తో పాటు చైనా మార్కెట్ బలంగా మారింది. కొన్నేళ్లుగా ఆయన సినిమాలు ఇక్కడ ఎంత వసూలు చేస్తున్నాయో అక్క‌డ‌ దానికి రెండింతలు వసూలు చేసి స‌త్తా చూపిస్తున్నాయి. దాంతో అమీర్ సినిమాలు అంటే హాట్ కేక్ లా మారిపోయాయి. వరుస విజయాలతో దండయాత్ర చేస్తున్న అమీర్ ఖాన్ కు థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఊహించని బ్రేక్  వేసింది. ధూమ్3 దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అమితాబ్ బ‌చ్చ‌న్, క‌త్రినా కైఫ్ లాంటి స్టార్ క్యాస్ట్ గా 300 కోట్ల బ‌డ్జెట్ తో వ‌చ్చిన ఈ చిత్రం క‌నీసం 200 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది. ఇక ఇదే సినిమాను ఇప్పుడు చైనాలో విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా విజయం సాధిస్తుందని అమీర్ ఖాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ నుంచి కూడా ఊహించని ఫలితం వచ్చింది. చైనాలో కూడా థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ ను తిప్పికొట్టారు ప్రేక్షకులు. చైనీయులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఎంతలా అంటే తొలి రోజు కేవలం 10 కోట్లతో సరిపెట్టుకున్న థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఆ తర్వాత కనీసం ఇంకో పది కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. అమీర్ ఖాన్ దంగల్.. సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తే థ‌గ్స్ మాత్రం 100 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. దాంతో అమీర్ ఖాన్ ఇంటాబయటా భారీ దెబ్బ త‌గిలింది. దాంతో ఇప్పుడు రాబోయే సినిమాతో కచ్చితంగా మళ్లీ ఫామ్ లోకి రావాలని తంటాలు పడుతున్నాడు అమీర్ ఖాన్. మరి ఈయన ఆశలు ఎంతవరకు నెరవేరుతాయనేది చూడాలి.

 

More Related Stories