English   

తల్లి బాటలోనే కూతురు

Aaradhya-Bachchan
2018-07-07 17:45:15

అమ్మ అందాల రాశి. అతిలోక  సుందరి. ఆ విషయాలు అదే స్థాయిలో అప్పుడే ఈ చిన్నారికి తెలుసని అనుకోలేం. కానీ ఆ లక్షణాలు ఎక్కడికిపోతాయి. అందుకే అమ్మ బాటలోనే ఆరాధ్య నడుస్తోంది. ప్రస్తుతం పారిస్ లో ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోలకు కొన్ని ఫోజులిచ్చింది. తర్వాత అదే స్టిల్స్ ను ఇమిటేట్ చేస్తూ ఆరాధ్య కూడా అచ్చం అమ్మను తలపించే ప్రయత్నం చేసింది. అమ్మలానే ఆరాధ్య అంటూ ఆ విషయాన్ని పారిస్ లోనూ కొన్ని మీడియాలు హైలెట్ చేశాయి. ఇక పెళ్లై ఆరాధ్య పుట్టిన తర్వాత ఐష్ జోష్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య రణ్ బీర్ కపూర్ తో చేసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి ఆశ్చర్యపరిచింది. 44యేళ్ల వయసులోనూ ఏ మాత్రం తరగని మేనిసొగసులతో అలరిస్తోన్న ఐష్ ను చూస్తే తనింకా స్వీట్ ట్వెంటీస్ లోనే ఉందేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఫన్నే ఖాన్ అనే సినిమాలో నటిస్తోన్న ఈ విశ్వసుందరి తన బాటలోనే కూతురినీ నడిపిస్తుందనడానికి ఇలాంటి స్టిల్సే ఆధారం. 

More Related Stories