English   

అభిమ‌న్యుడికి ఇప్పుడు కావాల్సింద‌దే..!

Abhimanyu now needs
2018-06-04 06:36:15

డ‌బ్బింగ్ సినిమాల‌కు పాజిటివ్ టాక్ చాలా అరుదుగా వ‌స్తుంటుంది. వ‌చ్చిన‌పుడు అది జారిపోకుండా ప్ర‌మోష‌న్ చేసుకోవాల్సిన బాధ్య‌త ద‌ర్శ‌క నిర్మాత‌ల‌దే. ఏ మాత్రం వ‌దిలేసినా ప్రేక్ష‌కులు కూడా వ‌దిలేస్తారు. టీవీల్లో వ‌చ్చిన‌పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటారు. ఇప్పుడు విశాల్ అభిమ‌న్యుడు సినిమాకు కూడా టాక్ చాలా బాగా వ‌చ్చింది. డిజిట‌ల్ నేరాల‌పై మిత్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఇన్ఫ‌ర్మేష‌న్ చాలానే ఉంది. కానీ ఈ సినిమా ప్రేక్ష‌కులకు మ‌రింత చేరువ అవ్వాలంటే ఇప్పుడు కావాల్సింది ప్ర‌మోష‌న్ ఒక్క‌టే. ప్ర‌స్తుతం విశాల్ కూడా ఇదే ప‌నిమీదున్నాడు. త‌మిళ నాడు కూడా పోకుండా ఇక్క‌డే ఉండి అన్ని ఛానెల్స్ కు.. పేప‌ర్స్ కు పిలిచి మ‌రి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. దానికి త‌గ్గ‌ట్లు సినిమా కూడా మంచి వ‌సూళ్లు తీసుకొస్తుంది. తొలిరోజే కోటి 10 ల‌క్ష‌ల‌కు పైగా షేర్ తీసుకొచ్చాడు అభిమ‌న్యుడు. ఇదే జోరు మ‌రో వారం రోజులు సాగితే తెలుగులోనూ అభిమ‌న్యుడు అద్భుతం చేసిన‌ట్లే..! అస‌లే చాలా ఏళ్లుగా తెలుగులో హిట్ కొట్టాల‌ని క‌ల‌లు కంటున్నాడు విశాల్. ఇంద్రుడు.. డిటెక్టివ్ లాంటి చాలా సినిమాల‌కు టాక్ బాగానే వ‌చ్చినా అది నిల‌బ‌డ‌లేదు. ఇప్పుడు అభిమ‌న్యుడు మాత్రం వ‌చ్చిన అవ‌కాశం మిస్ చేసుకోకూడ‌ద‌ని చూస్తున్నాడు. పైగా ఆఫీస‌ర్.. రాజుగాడు కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో మ‌హాన‌టితో పోటీ ప‌డుతున్నాడు విశాల్. కాస్త ప్ర‌మోష‌న్ చేసుకుంటే అభిమ‌న్యుడికి మ‌న ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఖాయం. 

More Related Stories