English   

బాక్సాఫీస్ పై అభిమన్యుడు దండయాత్ర

Abhimanyudu Box Office Collections
2018-06-08 16:44:28

కోలీవుడ్ స్టార్ విశాల్ లేటెస్ట్ మూవీ అభిమన్యుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తున్నాడు. ఏడు రోజుల్లోనే 12కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్నాడు అభిమన్యుడు. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు అటు కోలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. విశాల్ సరసన సమంత నటించిన ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయక పాత్రలో అదరగొట్టాడు. మొత్తంగా తెలుగు స్టేట్స్ లో ఒక వారం ఆలస్యంగా విడుదలైనా అభిమన్యుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. విడుదలైన అన్ని చోట్లా ఆశ్చర్యకరమైన కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. ఏరియాల వారీగా అభిమన్యుడు సాధించిన కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ప్రాంతాల వారీగా అభిమన్యుడు 7రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. 

నైజాం : 4కోట్ల 37లక్షల 52వేల 661 రూపాయలు

సీడెడ్  : 99లక్షల, 85వేల, 861రూపాయలు

వైజాగ్ : 1కోటి 50లక్షల2వేల 989రూపాయలు 

నెల్లూరు : 50లక్షల 63వేల222 రూపాయలు

ఈస్ట్‌ : 72లక్షల 35వేల 797 రూపాయలు

వెస్ట్‌ : 46లక్షల 41వేల 397రూపాయలు 

కృష్ణా : 1కోటి 03లక్షల 97వేల 414రూపాయలు 

గుంటూరు : 77లక్షల 09వేల 345 రూపాయలు 

కర్ణాటక : 49లక్షలు  

ఒరిస్సా, నార్త్‌ ఇండియా : 24 లక్షలు

ఓవర్సీస్‌ : 91 లక్షలు 

మొత్తం : 7 రోజుల టోటల్‌ కలెక్షన్స్ 12 కోట్ల01లక్ష 88వేల 686 రూపాయలు. 

More Related Stories