English   

విశాల్ అభిమ‌న్యుడు : ప్రివ్యూ

abhimanyudu preview
2018-05-31 10:23:06

విశాల్ అంటే ఇప్పుడు తెలుగులోనూ మంచి ఇమేజ్ ఉంది. ఎప్ప‌ట్నుంచో అది ఉన్నా కూడా ఇప్పుడు మ‌రింత పెరిగిపోయింది. ఈయ‌న చేస్తోన్న ప‌నులు రియ‌ల్ ఇమేజ్ తెచ్చిపెడుతున్నాయి. పైగా మంచోడు.. అన్నింటికి మించి సినిమాలు కూడా బాగానే వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు రెగ్యుల‌ర్ మాస్ సినిమాలు చేసిన విశాల్.. ఈ మ‌ధ్య స్టైల్ మార్చాడు. వ‌ర‌స‌గా కొత్త క‌థ‌లు ట్రై చేస్తున్నాడు. ఇలా చేసిన క‌థే ఇప్పుడు అభిమన్యుడు. డిజిట‌ల్ క్రైమ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మిత్ర‌న్. ఇప్ప‌టికే త‌మిళ‌నాట విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. స‌మంత ఈ చిత్రంలో హీరోయిన్. జ‌న‌వ‌రిలోనే రావాల్సిన ఈ చిత్రం స్ట్రైక్ కార‌ణంగా ఆల‌స్యం చేసారు. అయినా కూడా కంటెంట్ బ‌లంగా ఉండ‌టంతో ఈ చిత్రాన్నిఆద‌రించారు త‌మిళ ప్రేక్ష‌కులు. ఇకిప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల వంతు.. జూన్ 1న అభిమ‌న్యుడు విడుద‌లవుతుంది. ఇక్క‌డ కూడా భారీ అంచ‌నాల‌తోనే వ‌స్తుంది ఈ చిత్రం. స‌మంత ఇమేజ్ కూడా సినిమాకు ప్ల‌స్ కానుంది. పైగా గ‌త వారం రోజులుగా విశాల్ కూడా తెగ ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. ఇవ‌న్నీ సినిమాకు హెల్ప్ కానున్నాయి. మ‌రి చూడాలిక‌.. సినిమా ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories