English   

ఆచారి పాపం ఆయ‌న‌దేనా..?

Achari-America-Yatra
2018-04-28 16:17:48

ఆచారి అమెరికా యాత్ర‌.. ఈ చిత్రం వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మంది ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. విష్ణు సినిమాలు ఫ్లాప్ అవుతాయేమో కానీ మ‌రీ ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడెళ్ళాయో తెలుసుకోలేనంత గుర్తింపు లేని హీరో అయితే కాదు. కానీ ఈ సారి ఆచారి విష‌యంలో మాత్రం ఇదే జ‌రుగుతుంది. అస‌లు ఈ చిత్రం వ‌చ్చిన‌ట్లు కూడా ఇప్పుడు చాలా మందికి తెలియ‌ట్లేదు. నాలుగు నెల‌లుగా పురిటి నొప్పుల‌తో ఉన్న సినిమా స‌డ‌న్ గా వ‌చ్చింది. కానీ వ‌చ్చిన త‌ర్వాత సినిమా చాలా చెత్త‌గా ఉందంటూ ప్రేక్ష‌కులు చెబుతున్నారు. ఈ చిత్రంలో విష‌యం త‌క్కువ‌.. ప‌బ్లిసిటీ ఎక్కువ అయిపోయింది అని.. క‌నీసం గ‌త సినిమాల్లో విష్ణు-నాగేశ్వ‌ర‌రెడ్డి క‌లిసి కాస్త కామెడీ అయినా ఇచ్చార‌ని ఈ సారి కూడా అది కూడా లేద‌ని విమ‌ర్శిస్తున్నారు ప్రేక్ష‌కులు. ఆచారి అమెరికా యాత్ర ఇంత‌గా పోవ‌డానికి కార‌ణం కూడా విష్ణు కూడా. ఎందుకంటే ఈ చిత్రానికి హీరో అయ్యుండి కూడా నెగిటివ్ ప్ర‌చారం చేసాడు ఈయ‌న‌. నిర్మాత ఎంఎల్ కుమార్ చౌద‌రితో ఉన్న విభేధాల కార‌ణంగా ఆచారిని అస్స‌లు ప‌ట్టించుకోలేదు విష్ణు. పైగా విడుద‌ల టైమ్ లో అమెరికా వెళ్లిపోయాడు. కేవ‌లం హీరోయిన్ ప్ర‌గ్య మాత్ర‌మే ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది. క‌నీసం విష్ణు ముందుకొచ్చి ఉంటే సినిమా వ‌చ్చిన‌ట్లు అయినా ప్రేక్ష‌కులకు తెలిసుండేదేమో..? 

More Related Stories