English   

 ప్రివ్యూ: ఆచారి అమెరికా యాత్ర‌

Achari-America-yatra

 

ఆచారి అమెరికా యాత్ర.. టైటిల్ లోనే కావాల్సినంత ఫ‌న్ ఉంది. ఈ ఆచారి ఎవ‌రు.. ఆయ‌న అమెరికా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌నేది ఈ చిత్ర క‌థ‌. మ‌రికొద్ది గంట‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ రొటీన్ గానే అనిపిస్తున్నా న‌వ్వించ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తుంది. మంచు విష్ణు హీరోగా జి నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. బ్ర‌హ్మానందం ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈయ‌నే ఆచారి. ఆయ‌న్ని న‌మ్మించి అమెరికా తీసుకెళ్లి.. అక్క‌డ ఎలాంటి తిప్ప‌లు పెట్టార‌నేది అస‌లు క‌థ‌. కొన్నాళ్లుగా మున‌ప‌టి స్థాయిలో బ్ర‌హ్మి మాయ చేయ‌లేక‌పోతున్నాడు. కొత్త క‌మెడియ‌న్ల రాక‌.. ఎమ్మెస్ నారాయ‌ణ లాంటి సీనియ‌ర్ల పోక‌.. బ్ర‌హ్మి కెరీర్ కు అడ్డంకిగా మారింది. రేసుగుర్రం త‌ర్వాత ఆ స్థాయిలో న‌వ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెట‌ర్. అఖిల్, సౌఖ్యం, స‌ర్దార్ లాంటి సినిమాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఖైదీ నెం. 150లో కూడా బ్ర‌హ్మానందం కామెడీ పెద్ద‌గా పేలిందేమీ లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బ్ర‌హ్మానందం కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డాలంటే ఏదైనా అద్భుతం జ‌రగాల్సిందే..! ప్ర‌స్తుతం ఈయ‌నే ప్ర‌ధాన పాత్ర‌లో కామెడీ చిత్రాల ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి ఆచారి అమెరికా యాత్ర సినిమా చేసాడు. ప్ర‌గ్యాజైస్వ‌ల్ అందాలు సినిమాకు బోన‌స్. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. నాగేశ్వ‌ర‌రెడ్డి-విష్ణు కాంబినేష‌న్ లో దేనికైనా రెడీ.. ఆడోర‌కం ఈడోర‌కం సినిమాలు వ‌చ్చాయి. రెండూ బాగానే ఆడాయి. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్ర వ‌స్తుంది. అది కూడా బ్రాహ్మ‌ణ క‌థ ఆధారంగానే వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి అదే చేస్తున్నారు ఈ టీం. ఎప్రిల్ 27న ఆచారి అమెరికా యాత్ర విడుద‌ల కానుంది. మ‌రి విష్ణు కెరీర్ కు ఈ సినిమా ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుందో చూడాలి..!

More Related Stories