English   

పుట్టిన రోజున గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన ఆచార్య టీమ్

 Acharya first look
2020-08-06 10:03:02

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ఆచార్య. కరోనా వలన ఏర్పడిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా సుమారు 70 శాతం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమ కూడా కుదేలైన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో సమీప కాలంలో చిత్ర పరిశ్రమ మునుపటి స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ప్రభుత్వాలను బతిమలాడి పర్మిషన్స్ తెచ్చుకున్నా ఇప్పట్లో షూట్ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే ఆచార్య షూట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే షూట్ మొదలయిందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ విషయం మీద క్లారిటీ లేదు. అయితే చిరంజీవు పుట్టిన రోజు మరో పదిహేను రోజుల్లో ఉంది. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు నాడు అభిమానులకి గిఫ్ట్ ఇచ్చేందుకు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. 

అంతే కాక అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి ఇందులో దేవదాయ-ధర్మాదాయ శాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డెబ్బై శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More Related Stories