English   

క్యాస్టింగ్ కౌచ్.. నా కూతుర్ని ఎందుకు హీరోయిన్ చేస్తాను

Action King Arjun Comments on Casting Couch
2018-08-07 09:36:53

యాక్ష‌న్ కింగ్ అర్జున్ గురించి ఇప్పుడు కొత్త‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 38 ఏళ్లుగా ఈయ‌న ఇండ‌స్ట్రీలోనే ఉన్నాడు. 20 ఏళ్ల వ‌య‌సులోనే హీరోగా వ‌చ్చాడు ఇండ‌స్ట్రీకి. అప్ప‌ట్నుంచీ ఇక్క‌డ ప‌రిస్థితులు చూస్తున్నాడు. ఇక్క‌డ వాతావ‌ర‌ణం కూడా అర్జున్ కు కొత్త‌కాదు. ఈయ‌న కూతురు ఐశ్వ‌ర్య కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనే ఉంది. హీరోయిన్ గా కూడా రెండు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు అర్జున్ ముందుకు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న వ‌చ్చింది. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీని ప‌ట్టి పీడిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మీ అబిప్రాయం ఏంటి అని అర్జున్ ను అడిగారు. దానికి చాలా తెలివిగా స‌మాధానం చెప్పాడు అర్జున్.

మ‌నం తీసుకునే దాన్ని బ‌ట్టి ఉంటుంద‌ని చెబుతూనే.. తాను మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలోనే ఉన్నాను క‌దా.. ఇక్క‌డ ఏం జ‌రుగుతుంది మొత్తం త‌న‌కు తెలుసు అంటూనే.. అంత న‌మ్మ‌కం లేక‌పోతే త‌న కూతురును హీరోయిన్ ను ఎందుకు చేస్తాన‌ని ప్ర‌శ్నించాడు అర్జున్. ఈయ‌న చెప్పిన ఈ సమాధానం చాలామంది నోళ్లు మూయించేసింది. మొన్నీమ‌ధ్యే నాగ‌బాబు కూడా ఇదే మాట అన్నాడు. తాము అంతా ఇండ‌స్ట్రీపై బతుకుతున్న‌పుడు ఇక్క‌డ బుర‌ద జ‌ల్లితే త‌మ కడ‌పుపై తామే కొట్టుకున్న‌ట్లు క‌దా అని ఆవేశంగా మాట్లాడాడు నాగ‌బాబు. ఇప్పుడు అర్జున్ కూడా ఇదే అంటున్నాడు. సొంత ఇండ‌స్ట్రీని ఎవ‌రు ఎలా అర్థం చేసుకుంటే అలా ఉంటుంద‌ని చెప్పాడు ఈ యాక్ష‌న్ కింగ్.

More Related Stories