English   

యాక్షన్ రివ్యూ

 Action
2019-11-15 22:54:33

యాక్షన్ హీరో విశాల్‌ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు బాగానే చూస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు యాక్షన్ అంటూ పక్కా యాక్షన్ మూవీతో వచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం..

కథ:

సుభాష్ (విశాల్) ఓ ఆర్మీ కల్నల్ ఆఫీసర్. ఓ మిషన్ పూర్తి చేసుకుని అప్పుడే కుటుంబం దగ్గరికి వస్తాడు. ఆయన ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన అన్నయ్య శ్రవణ్ (రాంకీ) నెక్ట్స్ ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. అదే సమయంలో తన బంధువు మీరా (ఐశ్వర్య లక్ష్మీ) తో ప్రేమలో పడతాడు సుభాష్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ పార్టీ మీటింగ్ కు వచ్చిన ప్రధాని అభ్యర్థి గుప్తాజీని బాంబ్ బ్లాస్టులో చంపేస్తారు. ఆ ప్రమాదం తర్వాత సుభాష్ అన్నయ్య.. కాబోయే సిఎం శ్రవణ్ కూడా చనిపోతాడు. ప్రధాని అభ్యర్థిని చంపేసింది సుభాష్ ఫ్యామిలీ అని పుకార్లు పుడతాయి. అందులోంచి తన కుటుంబాలన్ని ఎలా బయటికి తీసుకొస్తాడు.. ఈ క్రమంలోనే తోటి ఆఫీసర్ తమన్నాతో కలిసి ఏం చేసాడనేది అసలు కథ.

కథనం:

యాక్షన్ అంటే టైటిల్ లోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పాడు దర్శకుడు సుందర్. చెప్పినట్లుగానే సినిమాను పూర్తిగా యాక్షన్ సీన్స్ తో నింపేసాడు. ఫస్టాఫ్ లోనే తొలి సీన్ నుంచే సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ చేసాడు దర్శకుడు. ఆ తర్వాత కుటుంబ కథ.. అందులోనే రాజకీయాలు అన్నీ జోడించి పర్ ఫెక్ట్ మసాలా యాక్షన్ సినిమాను సిద్ధం చేసాడు సుందర్. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో సినిమా అదిరిపోయింది. విశాల్ కూడా అదరగొట్టాడు.. ఆయనకు తోడు తమన్నా కూడా సూపర్బ్. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామాతో పాటే యాక్షన్ కథ కూడా నడుస్తుంది. సింపుల్ రివేంజ్ ఫార్ములా మాదిరే కనిపించినా కూడా ఎక్కడా తడబాటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు సుందర్. ఫస్టాఫ్ లో కొత్తమ్మాయి ఐశ్వర్య లక్ష్మీతో విశాల్ లవ్ ట్రాక్ పర్లేదు.. అది సరైన టైమ్ లోనే ముగించేసాడు దర్శకుడు. అక్కడ్నుంచి మళ్లీ యాక్షన్ మొదలు. అయితే సెకండాఫ్ మొదలైన తర్వాత సినిమా అంతా గోపీచంద్ ఈ మధ్యే నటించిన చాణక్య సినిమాను పోలి ఉంటుంది. అన్ని సీన్స్ దాదాపు కాపీ పేస్ట్ మాదిరే అనిపిస్తాయి. ఆ సినిమా చూడని వాళ్లకు ఇది ఫ్రెష్ అనిపిస్తుంది కానీ లేదంటే మాత్రం చాణక్యకు యాక్షన్ డూప్ మాదిరే కనిపిస్తుంది. ఈ విషయంలో సుందర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా స్క్రీన్ ప్లేతో సాగినా కూడా అక్కడక్కడా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అనిపించేలా డిజైన్ చేయడంలో సుందర్ అంతగా సక్సెస్ కాలేదేమో అనిపించింది. స్క్రీన్ ప్లేలో చాల చోట్ల లాజిక్ మిస్ అయింది. అదొక్కటే సినిమాకు మైనస్. తమన్నాతో విశాల్ కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.. వీళ్లు ప్రేమజంట కంటే మిలటరీ జంటగానే కనిపించారు.

నటీనటులు:

విశాల్ మరోసారి అదరగొట్టాడు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అయితే చించేసాడు. మరో రేంజ్ విశాల్ కనిపించాడు. తమన్నా గ్లామర్ షోతో పాటు నటనలో కూడా పర్లేదు. యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేసింది. ఇక ఐశ్వర్య లక్ష్మీ కూడా పర్లేదు. ఉన్నంత వరకు బాగా చేసింది. రాంకీ లాంటి సీనియర్ నటులు కూడా బాగానే ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. చాలా దేశాల్లోని ప్రదేశాలను చక్కగా ఆవిష్కరించాడు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చూపించాడు. ఇక శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే సెకండాఫ్ కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపించాయి. యాక్షన్ పొడుగు ఎక్కువైపోయింది. ట్రీమ్ చేసి ఉంటే.. బాగుండేదేమో అనిపించింది. సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ తమీజా మరోసారి బ్యాగ్రౌండ్ స్కోర్ చించేసాడు కానీ పాటలు మాత్రం బాగోలేవు. సుందర్ సి ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అనేలా ఈ చిత్రం ఉంది. దర్శకుడిగా ఆయన మరో మెట్టెక్కాడు కానీ కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

చివరగా: పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ విత్ స్మాల్ ప్రాబ్లమ్స్..

రేటింగ్: 2.75 /5.

More Related Stories