English   

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Actor Vivek died
2021-04-17 07:48:52

తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్(59) కన్నుమూశారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందినట్లు సమాచారం. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్‌ గుండెపోటుతో చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేరారు. వివేక్‌ను ఐసీయూలో ఎక్మో పై  ఉంచి చికిత్స  అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.

దాదాపు 300లకు పైగా చిత్రాల్లో  వివేక్ నటించారు. దర్శకుడు కె.బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. 'మనదిల్ ఉరుది వేండం' ద్వారా ఆయన సినీ ఆరంగేట్రం చేశారు. వివేక్ ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్ చిత్రంలో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. ఆ చిత్రంలో బాయ్స్‌కు సాయం చేసేపాత్రలో ఆయన అందరిని అలరించాడు. ఆ తర్వాత అపరిచితుడులో హీరోగా ఫ్రెండ్‌గా.. శివాజీ సినిమాలో కూడా వివేక్ తన నటనతో నవ్వించాడు. వివేక్ నటనకు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. తమిళంలో అయితే ఈయన టాప్ కమెడియన్. ఒకానొక సమయంలో వివేక్ లేని తమిళ సినిమా విడుదలయ్యేది కాదంటే అతిశయోక్తి కాదేమో..

More Related Stories