English   

అత్యంత దీన స్థితిలో చనిపోయిన బాలయ్య విలన్ !

Actor Mahesh Anand dies at 57
2019-02-10 03:00:10

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నెంబ‌ర్ వ‌న్ సినిమాలో విల‌న్‌ గా న‌టించిన బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ ఆనంద్(57) అందరికి గుర్తుండే ఉంటారు. ఆయన అంతలా గుర్తుండి పోడానికి కారణం ఆయ‌న బ్రహ్మానందంతో చేసిన పేపర్‌ ముక్కలు కామెడీ. ఈ కామెడీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన టాప్ హీరో సినిమా కూడా ఆయనకీ మంచి గుర్తింపు తెచ్చింది. 90ల‌లో విల‌న్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మ‌హేష్ ఆనంద్ దాదాపు 18 ఏళ్ళ గ్యాప్ తర్వాత రీసెంట్‌ గా గోవిందా తీసిన రంగీల రాజా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. జ‌న‌వ‌రి 18న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ సమయంలో ఆయన ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 18 ఏళ్ల తర్వాత నటుడు గోవింద రంగీలా రాజాలో అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఈ సమయంలో తాను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆర్థికంగా చితికిపోయానని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు బాధ పడాల్సిన విషయం ఏంటంటే మహేశ్ ఆనంద్ మృతి అత్యంత దయనీయ స్థితిలో మృతి చెందాడు. ముంబైలోని అంధేరీలో ఉన్న ఆయన నివాసం నుంచి పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం లభ్యమైన స్థితిని బట్టి ఆయన చనిపోయి కనీసం రెండు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  కొంత‌కాలం నుండి మ‌హేష్ ఒంట‌రిగా ముంబైలో ఉంటుండ‌గా, ఆయన భార్య మాస్కోలో ఉంటున్నట్లు సమాచారం. ఆయ‌న మృతికి బాలీవుడ్‌ చిత్ర సీమ సంతాపం వ్య‌క్తం చేసింది.

More Related Stories