English   

నితిన్ ను కాపాడేవాడే లేడా..?

Actor Nithiin Career Fall Down Started
2018-08-12 17:39:33

ఎప్పుడూ బ్రాండ్ నే కాదు.. అప్పుడ‌ప్పుడూ క‌థ‌ను కూడా న‌మ్ముకోవాలి. అలా చేసిన‌పుడు నితిన్ కు హిట్ వ‌చ్చింది. కానీ ఎప్పుడైతే బ్రాండ్ మోజులో ప‌డ్డాడో అప్ప‌ట్నుంచీ బ్యాండ్ మొద‌లైంది. కావాలంటే చూడండి.. 12 ఫ్లాపుల త‌ర్వాత నితిన్ కు హిట్ ఇచ్చింది స్టార్ డైరెక్ట‌ర్ కాదు.. అప్ప‌టికి తెలుగులో సినిమా చేసి 11 ఏళ్లైన విక్ర‌మ్ కే కుమార్. ఈ చిత్రం త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌యిందే అంటూ నితిన్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది విజ‌య్ కుమార్ కొండా అనే కొత్త ద‌ర్శ‌కుడు. కానీ పూరీ క‌థ న‌మ్మి ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ చేసాడో అప్పుడే షాక్ తిన్నాడు. ఆ త‌ర్వాత కూడా క‌రుణాక‌ర‌ణ్ తో చిన్న‌దాన నీ కోసం చేసి చేతులు కాల్చుకున్నాడు.

త్రివిక్ర‌మ్ ఒక్క‌డే నితిన్ కు హ్యాండివ్వ‌కుండా ఉన్నాడు. అ..ఆతో హిట్టిచ్చినా.. రైట‌ర్ గా మాత్రం షాక్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్. ఈయ‌న రాసిన ఛ‌ల్ మోహ‌న్ రంగా నితిన్ కు ఫ్లాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్ లో బ్రాండ్ న‌మ్ముకుని చేసిన శ్రీ‌నివాస క‌ళ్యాణంకు కూడా టాక్ తేడాగానే వ‌చ్చింది. ముందు నుంచి ఈ సినిమా క‌థపై అంతా చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇంత కూడా నెగిటివ్ టాక్ లేకుండా విడుద‌లైన ఈ చిత్రం.. తొలిరోజే ఊహించ‌ని విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు నితిన్ కెరీర్ మ‌ళ్లీ ఊబిలో ప‌డిపోయింది. మ‌రిప్పుడు ఈయ‌న కెరీర్ కు చేయిచ్చి పైకి తీసుకొచ్చే ద‌ర్శ‌కుడు ఎవ‌రో..? ప‌్ర‌స్తుతం ఈయ‌న వెంకీ కుడుముల‌తో భీష్మ సినిమా చేస్తున్నాడు. ఛ‌లో త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇది

More Related Stories