English   

ప్రముఖ విలన్‌ పరిస్థితి విషమం.. అండగా నిలిచిన కమల్ హాసన్..

 Ponnambalam
2020-07-11 08:36:48

పొన్నాంబళం.. ఈ పేరుతో తెలుగు ఆడియన్స్ కు కూడా బాగానే పరిచయం. ఎందుకంటే కేవలం తమిళ సినిమాలే కాదు తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా చాలానే నటించాడు ఈయన. ముఖ్యంగా విలన్ పాత్రలతో సుపరిచితుడిగానే మారిపోయాడు పొన్నంబళం. తనదైన విలనిజంతో ప్రత్యేకంగా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజులుగా ఈయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అయితే ఈ విషయం బయటికి రాలేదు. ప్రస్తుతం ఈయన అక్కడ ఆక్సిజన్ మాస్క్‌తో ఊపిరి తీసుకుంటున్నాడు. ఇక్కడ మరో విచారకర విషయం ఏంటంటే ఈయనకు ఆర్థికంగా కూడా బాగోలేదు. ప్రస్తుతం ఆయన తనకు సాయం చేయాలని ఓ వీడియో విడుదల చేసాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఈ వీడియో చూసిన లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించాడు. సాయం చేయడానికి ముందుకొచ్చాడు. వెంటనే ఆయన పొన్నంబళం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. ఆర్థిక సాయం కూడా చేస్తానని మాటిచ్చాడు. అంతటితో ఆగకుండా పొన్నాంబళం పిల్లలను చదివించే బాధ్యత కూడా తీసుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు ఆస్పత్రిలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని కమల్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన సిబ్బందికి సూచించాడు కూడా. కమల్ ఇచ్చిన భరోసాతో విలన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొన్నాంబళం ఇంత సీరియస్ పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఊహించలేదు. త్వరలోనే ఆయన మళ్లీ మామూలు స్థితికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

More Related Stories