English   

రాజ్ త‌రుణ్ డైరెక్ట‌ర్ అవుతున్నాడా..?

Raj Tarun Went Tirumala Gundu

ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. హీరోలు గుండు కొట్టించుకోవ‌డం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ల‌కు హెయిర్ స్టైల్ అనేది కీల‌కం. వాళ్లేం చేసినా సినిమాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కూడా దానికే. అలాంటి జుట్టుతో ప్ర‌యోగాలు చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ ఇప్పుడు రాజ్ త‌రుణ్ అది చేసాడు. ఈయ‌న తిరుమ‌లేశుడి కోసం త‌న వెంట్రుక‌లు ఇచ్చేసాడు. ఈ మ‌ధ్యే తిరుప‌తి వెళ్ళి దైవ‌ద‌ర్శ‌నం చేసుకున్న రాజ్ త‌రుణ్.. ల‌వ‌ర్ టీంతో క‌లిసి అక్క‌డ క‌నిపించాడు. ఆయ‌న‌తో పాటు హీరోయిన్ రిద్ధికుమార్.. ద‌ర్శ‌కుడు అనీష్ కృష్ణ కూడా ఉన్నారు. ఈయ‌న గుండుపైనే ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది.

ఈయ‌న‌తో పాటు నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి కూడా గుండు చేయించుకున్నాడు. సినిమా విడుద‌లైన త‌ర్వాత మొక్కు తీర్చుకున్నారు. నిర్మాత‌కు గుండు అంటే ఓకే కానీ ఇప్పుడు రాజ్ త‌రుణ్ గుండు మాత్రం హాట్ టాపిక్కే. ఎందుకంటే ఈయ‌న త‌ర్వాతి సినిమాల‌కు అది స‌మ‌స్య‌గా మారుతుంది. కానీ ధైర్యంగా గుండు చేయించుకున్నాడంటే మాత్రం క‌చ్చితంగా ఈయ‌న‌కు చేతిలో సినిమాలేం లేవు. పైగా ఇప్పుడు న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసి ద‌ర్శ‌కుడిగా మారాల‌ని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో. త‌న సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాక‌పోవ‌డంతో న‌ట‌న చాల‌నుకుంటున్నాడు. ఎలాగూ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా అనుభ‌వం ఉంది కాబ‌ట్టి క‌థ సిద్ధం చేసుకునే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తుంది. అప్ప‌ట్లో సునీల్ తో సినిమా చేయాల‌నుకున్నా అది వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రి ఇప్పుడు ఈ కుర్ర హీరో ఏం చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories