English   

చిరంజీవికి షాక్ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్

Actor Rajasekhar New Movie Title Launch Announcement on Chiru Birthday
2018-08-22 13:18:12

చిరంజీవి.. రాజ‌శేఖ‌ర్.. ఈ పేర్లు ప‌క్క‌ప‌క్క‌న బెట్టి చ‌దివితే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ వ‌స్తుంది. దానికి కార‌ణం వీళ్ల మ‌ధ్య వైర‌మే. కానీ ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది. నువ్వు నేను అంటూ క‌లిసి క‌నిపిస్తున్నారు ఈ హీరోలిద్ద‌రూ. ఇక ఇప్పుడు చిరంజీవికి సూప‌ర్ షాక్ ఇచ్చాడు రాజ‌శేఖ‌ర్. ఆయ‌న పుట్టిన‌రోజు కానుక‌గా త‌న సినిమా ప్రీ లుక్ విడుద‌ల చేసాడు రాజ‌శేఖ‌ర్. ఆగ‌స్ట్ 26న ఫ‌స్ట్ లుక్ టైటిల్ విడుద‌ల కానుంది. ఈ పోస్ట‌ర్ లో కింద ఖైదీ సినిమా నేడే విడుద‌ల అనే పాత పోస్ట‌ర్ క‌నిపిస్తుంది. అ.. సినిమాను తెర‌కెక్కించిన ప్రశాంత్ వ‌ర్మ దీనికి ద‌ర్శ‌కుడు. అస‌లు చిరంజీవి పుట్టిన‌రోజును రాజ‌శేఖ‌ర్ ఇలా వాడుకోవ‌డం నిజంగానే అంద‌రికీ షాక్.

పైగా ఈ మ‌ధ్యే ఓ ప్రెస్ మీట్ లో చిరంజీవితో క‌లిసిపోయాం.. ఇప్పుడు మా మ‌ధ్య ఏ గొడ‌వ‌లు లేవు.. గ‌రుడ‌వేగ స‌క్సెస్ కు చిరంజీవి కూడా ఓ కార‌ణ‌మే అంటూ ఆయ‌న్ని ఆకాశానికి ఎత్తేసాడు రాజ‌శేఖ‌ర్. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన కొత్త‌లో తాను చిరంజీవి పార్టీ చేరన‌ని.. అత‌డికి రాజకీయ అనుభ‌వం లేద‌ని అన్నాడు రాజ‌శేఖ‌ర్. దానికి ఫ్యాన్స్ అత‌డిపై దాడి చేసారు. అప్ప‌ట్నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ర‌చ్చ మొద‌లైంది. ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత అది మ‌రింత పెరిగింది. కానీ గ‌రుడ‌వేగ టైమ్ లో అంతా సెటిల్ అయిపోయింది. ఈ సినిమాకు త‌న‌వంతు ప్రమోష‌న్ కూడా చేసాడు చిరంజీవి.

More Related Stories