English   

రకుల్ పిటిషన్..కోర్టు ప్రశ్నల వర్షం

Rakul Preet Singh
2020-09-30 13:55:07

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో ఇటీవల ఎన్సీబి విచారించిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్ కేసులో తన పేరు మీడియాలో వస్తోందని..తాను సిగరెట్ తాగడం, మద్యం సేవించడం కూడా చేయనని ఢిల్లీ హైకోర్టు లో రకుల్ పిటిషన్ దాఖలు చేసింది. తాను ఈ కేసులో కేవలం సాక్షిని అని ని ధితురాలిని కానని రకుల్ పేర్కొంది. మీడియాలో తన పేరు రావడాన్ని నిరోధించాలంటూ పిటిషన్ లో కోరింది. కాగా ఈ రోజు ఆ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. రకుల్ పేరును డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ మీడియాలో వస్తున్న కథనాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలను ప్రశ్నించింది. అక్టోబర్ 3 వరకు కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

More Related Stories