English   

మరో సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్

 Sakshi Siva
2020-07-04 07:47:53

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా టివి నటీనటులను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తూనే ఉంది. రోజు రోజుకు కోవిడ్ 19 బారిన పడుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్న ప్రభాకర్, హరికృష్ణ, నిన్న నవ్య స్వామిలకి కరోనా సోకగా ఈరోజు టివి నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అక్క మొగుడు , నెంబర్ 1 కోడలు , మౌన రాగం సీరియల్స్ లో నటిస్తున్నాడు శివ. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసులు పెరుగుతుండటంతో నటీనటులు అందరిలో ఆందోళన నెలకొంది. దీంతో కరోనా టెన్షన్ తోనే టివి కళాకారులు షూటింగ్ లు చేస్తున్నారు. అయితే ఎన్ని  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా బారిన పడుతూనే ఉండడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచని స్థితిలో టివి ఇండస్ట్రీ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకప్పటి నటుడు సాక్షి రంగారావు కుమారుడే ఈ సాక్షి శివ, తెలుగులో భరత్ అనే నేను, అలాగే గుణ 369 అనే సినిమాల్లో కూడా నటించారు. 

More Related Stories