English   

సెక్స్ రాకెట్ లో నటి సంగీత

actor sangeetha in sex rocket
2018-06-02 20:21:13

చెన్నైలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు బయటపడింది. అయితే ఈ రాకెట్ లో ఉన్నవాళ్లంతా ఆర్టిస్టులే కావడం ఆశ్చర్యం. సినిమాల్లోనూ, సీరియల్స్ లో నటిస్తోన్న కొందరు పాపులర్ అమ్మాయిలే ఈ సెక్స్ రాకెట్ లో దొరికిపోయారు. అయితే వీరందరినీ ఈ వ్యభిచారంలోకి దించింది కూడా మరో పాపులర్ నటి కావడం విశేషం. గతంలో పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన సంగీత అనే నటి ఈ సెక్స్ రాకెట్ కు లీడర్ గా ఉందని తేల్చారు పోలీస్ లు. తనకు పరిచయమైన అమ్మాయిల్ని, ఆల్రెడీ సీరియల్స్, సినిమాల్లో కొంత గుర్తింపు ఉన్న అమ్మాయిలను ఈ రాకెట్ లో దించి కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తోంది నటి సంగీత. 

మొత్తంగా ఈ రోజు చెన్నైలోని ఓ రిసార్ట్ లో పోలీస్ లు జరిపిన రైడ్ లో ఈ భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. తమిళనాట కొంత పాపులారిటీ ఉన్న నటిగానే సంగీత కు పేరుంది. ఆ పేరుతోనే ఇంత పెద్ద రాకెట్ ను నిర్వహిస్తోందని చెబుతున్నారు పోలీస్ లు. చెన్నైలోనే కాక.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సంగీత అమ్మాయిలను సప్లై చేస్తుందని పోలీస్ ల విచారణలో తేల్చారు. మొత్తంగా ఇన్నాళ్లూ తమకు తెలిసిన నటిగా ఉన్న సంగీత ఇంత పెద్ద వ్యభిచార రాకెట్ ను నిర్వహిస్తోందని తెలిసి కొందరు సీనియర్ ఆర్టిస్టులు కూడా షాక్ అయిపోయారు. 

More Related Stories