English   

షాకింగ్ సంజయ్ దత్ కి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్

 Sanjay Dutt
2020-08-12 09:27:51

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కొద్ది రోజుల అస్వస్థతకు గురయ్యారన్న సంగతి తెల్సిసిందే. దాంతో వెంటనే ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో ఆయన వైద్యులను సంప్రదించగా ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో ఆయనకు హుటాహుటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. ఇక తాజాగా నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానని కూడా సంజయ్ దత్ తెలిపారు. అయితే ఆయన విషయంలో ఒక షాకింగ్ అంశం బయట కొచ్చింది. ఆయనకు స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంజయ్ దత్ కి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన ఈ వార్త విన్న వెంటనే సంజయ్ నీరు గారిపోయాడని అన్నారు. ప్రస్తుతం పిల్లలు తమ తల్లితో దుబాయిలో ఉన్నారని, ఇది వారికి కూడా అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. అయితే ఇది తగ్గే క్యాన్సర్ అని పేర్కొన్న ఆయన వెంటనే సంజయ్ అమెరికా చికిత్స కోసం వెళ్తున్నాడని పేర్కొన్నారు. ఆయన లీలావతి ఆసుపత్రిలో చేయించుకున్న పరీక్షల ఫలితాలు కొద్దిసేపటి క్రితమే వచ్చినట్టు తెలుస్తోంది. 

More Related Stories