రాధిక శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష

సౌత్ ఇండియా సీనియర్ నటీనటులు రాధిక, శరత్ కుమార్ లకు కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. 2017 చెక్ బౌన్స్ కేసులో కోర్టులో రాధిక శరత్ కుమార్ కు చుక్కెదురైంది. చెన్నై కి చెందిన స్పెషల్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. మ్యాజిక్ ఫ్రేమ్స్ అనే ఓ సంస్థకు రాధికా శరత్ కుమార్ లు రూపాయలు కోటి నలబై లక్షలకు సంభందించిన చెక్ ఇవ్వగా అది బ్యాంకులో చెల్లుబాటు అవ్వలేదు. అనంతరం సంస్థ పలు మార్లు డబ్బు చెల్లించాలని కోరినప్పటికీ రాధిక శరత్ కుమార్ లు పట్టించు కోలేదు. దాంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అయితే రాధిక శరత్ కుమార్ కు మరో అవకాశంగా కోర్టులో అపీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా 2017 నుండి రాధిక శరత్ కుమార్ పలు వివాదాలలో చిక్కుకుంటున్నారు. అటు సినిమాల పరంగానూ ఇటు వ్యాపారం పరంగానూ అనేక ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నటీనటులకు పేమెంట్స్ సరిగ్గా ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా శరత్ కుమార్ పై వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడటం హాట్ టాపిక్ గా మారింది.