English   

సునీల్ మృతి అంటూ ప్ర‌చారం.. నేను క్షేమం అంటున్న క‌మెడియ‌న్..

Sunil
2019-03-15 16:06:01

సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతుంది. వాళ్ల పేజ్ వ్యూస్ కోసం ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ రాసి సెలబ్రిటీల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ దుర్మరణం పాలయ్యాడు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కెర్లు కొడుతుంది. దాంతో అది చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంలో సునీల్ మృతి చెందాడు అంటూ ఇష్టమొచ్చినట్లు రాతలు రాసేసారు. అయితే వీళ్ళు రాసిన దాంట్లో ఒక నిజం కూడా ఉంది. ఆ చనిపోయిన నటుడి పేరు సునీల్ కావడం ఒక్కటి మాత్రమే నిజం. దానిని వాళ్లు క్యాష్ చేసుకోవడానికి రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నటుడు సునీల్ మృతి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ చేశారు. ఇది సునీల్ వరకు వెళ్ళింది. వెంటనే దీన్ని ఖండిస్తూ ఆయన తన ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. నేను క్షేమంగా ఉన్నాను అభిమానులు కంగారు పడొద్దు అంటూ ట్వీట్ చేసాడు సునీల్. ఇంతకీ విషయం ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో నందం సునీల్ అనే టీవీ యాక్టర్ చనిపోయాడు. ఈయన తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నాడు. ఆయన చనిపోవడంతో ప్రముఖ సినీ నటుడు సునీల్ దుర్మరణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాసేసారు. ఇలాంటి వార్తలు రాసి అనవసరంగా మా జీవితాలతో ఆడుకోవద్దని సినిమాలు కూడా ఫైర్ అవుతున్నారు.

More Related Stories