English   

షాకింగ్.. చంటి సోద‌రుడు క‌న్నుమూత‌..!!

vinod artist
2018-07-14 10:57:12

తెలుగు ఇండ‌స్ట్రీలో చంటి సినిమాకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. అందులో న‌టించిన వాళ్లంతా ఇప్ప‌టికీ క‌ళ్ల ముందే ఉంటారు. అందులో మీన‌కు రెండో అన్న‌య్య‌గా న‌టించిన వినోద్ గుర్తున్నాడా..? ఆయ‌న ఇప్పుడు లేడు. బ్రెయిన్ స్ట్రోక్ తో అర్ధాంత‌రంగా చ‌నిపోయాడు వినోద్. తెలుగు ఇండ‌స్ట్రీ ఓ మంచి కారెక్ట‌ర్ ఆర్టిస్టును కోల్పోయింది. 80ల్లోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వినోద్.. ఆ త‌ర్వాత కూడా చాలా సినిమాల్లో న‌టించాడు. ముఖ్యంగా విల‌న్ గా 300 సినిమాల్లో చేసాడు వినోద్. దానికితోడు లారీ డ్రైవర్.. ఇంద్ర తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు వినోద్. 

విలన్ బ్యాచ్ లో ఒక‌డిగా.. లేదంటే విలన్ కు తమ్ముడిగా నటించే వినోద్.. 1980లో కీర్తికాంత కనకం సినిమాతో ప‌రిచ‌యం అయ్యారు. అప్ప‌టికి ఆయ‌న వ‌య‌సు 21 ఏళ్లే. ఈయ‌న ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌యం అయ్యారు కానీ ఆ త‌ర్వాత కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఈయ‌న మరణవార్త విన్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ఇంటికి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా క్యూ క‌డుతున్నారు. జులై 14 తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చింది.

More Related Stories