English   

డిజిట‌ల్ మాయ వాడేస్తున్న విశాల్

Actor Vishal Visits Temples Due to Pandem Kodi 2 Release
2018-08-21 15:17:13

విశాల్ కు తెలుగులో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న తెలుగు వాడే కావ‌డంతో మ‌నోడే అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. పైగా అర‌వ‌నేల‌పై మ‌న జెండా గ‌ట్టిగా పాతేసాడు ఈ హీరో. దాంతో విశాల్ ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ గుండెల్లోనే దాచేసుకున్నారు. అదృష్టం బాగుండి వ‌ర‌స విజ‌యాలు కూడా ఈ హీరోకు వ‌రంగా మారాయిప్పుడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన అభిమ‌న్యుడు తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే ఇప్పుడు పందెంకోడి 2ను ఒకేసారి తెలుగు, త‌మిళ భాషల్లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు ఈ హీరో. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైంది. గుళ్లు గోపురాలు తిరుగుతూ సినిమా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాడు విశాల్. 14 ఏళ్ల కింద తెలుగులో వ‌చ్చిన పందెంకోడి సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

అప్ప‌టికి విశాల్ ఎవ‌రో తెలియ‌క‌పోయినా క‌థ న‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ చేసారు. ఆ త‌ర్వాత విశాల్ తెలుగ‌బ్బాయని తెలిసి వ‌ర‌స‌గా భ‌ర‌ణి.. పొగ‌రు లాంటి విజ‌యాలు అందించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విశాల్ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. మ‌ధ్య‌లో కొన్ని విజ‌యాల‌తో స్టార్ అయిపోయాడు విశాల్. దానికితోడు బ‌య‌ట కూడా మంచి ప‌నులు చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు విశాల్. మ‌రోవైపు సినిమాల ప‌రంగానూ బిజీగానే ఉన్నాడు విశాల్. అక్టోబ‌ర్ 18న పందెంకోడి 2 విడుద‌ల కానుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి లింగుస్వామి ద‌ర్శ‌కుడు. అదే రోజు తెలుగులో రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే విడుద‌ల కానుంది. కానీ దిల్ రాజు సినిమాకు పోటీగానే పోటెత్తుతున్నాడు విశాల్. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బడుతుందో చూడాలిక‌..!

More Related Stories