English   

కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి...ఇద్దరికీ ఇష్టమైతేనే తప్పు

Actress Annapoorna
2021-04-10 11:12:00

ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటివరకు చాలా మంది నటీమణులు నోరు విప్పారు. అయితే కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పగా..మరి కొందరు మాత్రం మాకు అలాంటి ఇబ్బందులు ఎదురవలేదని చెబుతుంటారు. అయితే అవకాశాలు లేని వారే తమకు అన్యాయం జరిగిందంటూ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తారనే టాక్ కూడా ఇండస్ట్రీ లో ఉంది. 

అయితే తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణ క్యాస్టింగ్ కౌచ్ పై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు అనేది ప్రతిసారి ఒకరివైపే ఉండదని ఇద్దరి ప్రమేయం ఉన్నప్పుడే తప్పు జరుగుతుందని వ్యాఖ్యానించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక అనవసరపు వ్యవహారమని అన్ని రంగాల్లోనూ ఇది ఉందని పేర్కొంది. కుటుంబం గౌరవం లాంటివి దృష్టిలో పెట్టుకుని మహిళలు  వేధింపులను నుండి తప్పించుకువస్తారని తెలిపింది. అలాగే ఇండస్ట్రీ లో ఉన్న ఆడవాళ్లు కూడా తప్పించుకుని తిరగాలి చెప్పింది. ఎవరైనా ఇబ్బందులు ఎదురుకుంటే ఎదిరించాలి. మాట్లాడాలి అంటూ పేర్కొంది. అంతే కాకుండా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం వచ్చే వారికి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతాయని పేర్కొంది. తప్పు జరిగిందంటే ఒక్కరినే నిందించలేమని...దాని వెనక ఉన్న విషయాలను తెలుసుకోవాలని తెలిపింది.

More Related Stories