English   

పండంటి పాపకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

Hari Teja
2021-04-06 14:49:20

బిగ్ బాస్ బ్యూటీ ప్రముఖ నటి హరితేజ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంది హరితేజ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని రోజుల తాను గర్భవతి అన్న విషయం అభిమానులకు చెప్పింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. 2015 లో దీపక్ ను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత కూడా కెరీర్ విజయవంతంగా కొనసాగిస్తున్న హరితేజ.. త్రివిక్రమ్ సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 

ముఖ్యంగా అ.. ఆ సినిమాలో ఆమె చేసిన పని మనిషి యాత్ర బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొత్త సినిమాలు చేసింది హరితేజ. అయితే సినిమాల కంటే కూడా బిగ్ బాస్ షోతో ఎక్కువగా పాపులర్ అయింది ఈ భామ. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ లో హరితేజ చివరి వరకు వచ్చింది. లౌడ్ స్పీకర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఈమెకు ముద్దు పేరు కూడా పెట్టాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది హరితేజ. ఇదిలా ఉంటే గత ఏడాది లాక్డౌన్ సమయంలో గర్భం దాల్చింది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చింది హరితేజ. ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

More Related Stories