English   

బ‌తికుండ‌గానే చంపేస్తారా..? 

actor-Jayanthi

సీనియ‌ర్ న‌టి జ‌యంతి చ‌నిపోయింది.. ఆమె ఇక లేరు.. క‌న్నుమూసింది.. బెంగ‌ళూర్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది.. అంటూ మీడియాలో మార్చ్ 27 రాత్రి చాలా సేపు బ్రేకింగ్స్ న‌డిచాయి. కానీ తెల్లారేస‌రికి అంతా మారిపోయింది. చికిత్స‌కు స్పందిస్తున్న జ‌యంతి అంటూ వార్త‌లొచ్చాయి. దాంతో అంతా షాక్. అదేంటి రాత్రి చ‌నిపోయిన ఆమె పొద్దున్నే ఎలా బ‌తికింది..? ఓహో.. ఇదంతా మీడియా నిర్వాక‌మా అంటూ అప్పుడు నిట్టూరు స్తున్నారు జ‌నాలు. రోజుల్లో పోటీ ప్ర‌పంచం బాగా ఎక్కువైపోయింది. ఎవ‌డు ముందు చెబితే వాడే తోపు. అందుకే అప్పుడ‌ప్పుడూ కాస్త తొంద‌ర‌పాటు కూడా ఉంటుంది. ఎంత‌లా అంటే బ‌తికుండగానే చంపేసేంత‌..? 

అక్క‌డ ఆక్సీజ‌న్ పైప్ పెట్టారు అంటే ఇక్క‌డ లాగేసారు అని చెప్పేంత తొంద‌ర‌పాటు ఇప్పుడు మీడియాలో క‌నిపిస్తుంది. అది హాలీవుడ్ యాక్ట‌ర్ సిల్వెస్ట‌ర్ స్టాలిన్ కానీ.. బాలీవుడ్ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కానీ.. మ‌న ద‌గ్గ‌ర జ‌యంతి కానీ.. ఎవ‌రైనా కానీ వాళ్లు చ‌నిపోక ముందే చ‌నిపోయారు అని ర‌చ్చ ఎందుకు చేయ‌డం..? ఒక్క‌సారి చేసిన త‌ర్వాత ఆకులు ఎందుకు ప‌ట్టుకోవ‌డం..?  ఇది మొద‌టిసారి అయితే ఏదో అనుకోవ‌చ్చు..? ఓ మ‌నిషికి సీరియ‌స్ గా ఉందంటే అత‌డు చ‌నిపోయాడు అని కాదు క‌దా అర్థం. బ‌త‌క‌డానికి ట్రై చేస్తున్నాడ‌ని క‌దా..? క‌నీసం అది కూడా అర్థం చేసుకోక‌పోతే ఎలా..? 

చ‌నిపోయిన త‌ర్వాత ఎలాగూ వ‌ద‌ల‌రు.. క‌నీసం బ‌త‌కడానికి పోరాటం చేస్తున్న‌పుడైనా వ‌దిలేయొచ్చు క‌దా..? మీడియా అన్నీ చూపించాలి కానీ అబ‌ద్ధాల‌ను కాదు. రాజ‌కీయ ప‌రంగా ఎన్ని అబ‌ద్ధాలైనా చూపించండి.. సినిమాల ప‌రంగా మీ ఇష్టం.. ఎందుకంటే అది ఎవ‌రికీ పెద్ద‌గా యూజ్ ఉండ‌దు.. ప‌ట్టించుకోరు కూడా. కానీ చావుల ద‌గ్గ‌ర మాత్రం అంత తొంద‌ర ఎందుకో అని కొంద‌రు బాహాటంగానే మీడియా తీరును త‌ప్పు ప‌డుతున్నారు. గ‌తంలో ఎమ్మెస్ నారాయ‌ణ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఆయ‌న చ‌నిపోవ‌డానికి ఒక్క‌రోజు ముందే చ‌నిపోయాడ‌ని ఫిక్స్ చేసారు. పాపం.. ఆ బాధ త‌ట్టుకోలేకేనేమో ఒక్క‌రోజులో ఆయ‌న లోకం విడిచి వెళ్లిపోయారు. మ‌రి ఈ తీరు ఎప్ప‌టికి మారుతుందో ఏమో..?

More Related Stories