English   

సెక్స్ గుర్తుకొస్తే .. హీరోయిన్ దారుణమైన కామెంట్స్..

Actress Kasthuri
2020-01-20 13:42:10

ఒక్కోసారి విచక్షణ కోల్పోతే కోపంలో ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఓ సీనియర్ హీరోయిన్ తన స్థాయిని కూడా మరిచిపోయి దారుణంగా మాట్లాడింది. అయితే ఆమె అంత కోపంగా రియాక్ట్ కావడానికి కారణం ఆమె కారెక్టర్ ను మరికొందరు దిగజార్చి మాట్లాడటమే. పర్సనల్ అటాక్ చేసేసరికి తట్టుకోలేక ఆ హీరోయిన్ కూడా నోరు జారింది. 

ఏకంగా అమ్మ, చెల్లిని కూడా టార్గెట్ చేసింది. ఆమె మరెవరో కాదు కస్తూరి. తెలుగులో అన్నమయ్య సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ అన్నమయ్య కస్తూరిగానే పేరు తెచ్చుకుంది ఈమె. ఇప్పుడు ఈమెకు అజిత్ అభిమానులతో గొడవ జరిగింది. గతంలోనే ఓ సారి అజిత్ ఫ్యాన్స్ తో పెట్టుకుంది ఈమె. విశ్వాసం సినిమా టైమ్ లో ఈమె చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులకు కోపం తెప్పించాయి. 

ఇక ఇప్పుడు కూడా అజిత్ ఫ్యాన్ ఒకరు కస్తూరిని పర్సనల్ అటాక్ చేసాడు. అసభ్యకరంగా మాట్లాడాడు. దాంతో తట్టుకోలేని ఆమె దారుణంగా కమెంట్ చేసింది. ఇప్పుడు ఈమెతో అజిత్ అభిమానులు దారుణంగా ఆడుకుంటున్నారు. అసలే త‌మిళ‌నాట ఫ్యాన్స్ వార్ దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానులను ఏమైనా అంటే మాత్రం వాళ్లు రెచ్చిపోతారు. అందుకే వాళ్లేం చేసినా కూడా ఎవ‌రూ ఏం అడ‌గ‌రు. అది తెలిసి కూడా ఇప్పుడు అజిత్ అభిమానుల‌తో పెట్టుకుంది కస్తూరి. సోషల్ మీడియాలో తన కారెక్టర్‌ను డీ గ్రేడ్ చేస్తూ ఓ అజిత్ ఫ్యాన్ చేసిన కామెంట్స్‌కు సీరియస్‌గా రియాక్ట్ అయింది కస్తూరి. 

తనపై అసభ్యకర కామెంట్స్ చేసినందుకు ఆమె సీరియస్ అయింది. మామూలుగా కాదు.. ఏకంగా అమ్మ చెల్లిని కూడా తీసుకొచ్చింది కస్తూరి. సిగ్గు లేదా.. అజిత్ అభిమానినని చెప్పుకుంటూ ఆడవాళ్లపై ఇంత నీచమైన కామెంట్స్ చేస్తావా.. పైగా ఇలాంటి వెధవలకు మళ్లీ సపోర్ట్ కూడా చేస్తారా అంటూ దారుణంగా కామెంట్స్ చేసింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

అసలు ఇలాంటి వాళ్లను ఏం చేయాలి.. అమ్మాయిని నీచంగా మాట్లాడే వాళ్లకు ఎలాంటి శిక్షలు వేయాలి అంటూ రెచ్చిపోయింది కస్తూరి. మీకు అమ్మాయిని చూడగానే సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే బయటికి వెళ్లే బదులు మీ అమ్మ దగ్గరికో లేక చెల్లి దగ్గరికో వెళ్లండంటూ కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఎంత కోపం ఉన్నా కూడా ఆమె కూడా ఆడదే కదా.. అమ్మ, చెల్లి గురించి కమెంట్స్ చేయకుండా ఉండాల్సింది అంటూ కస్తూరిపై కౌంటర్స్ పడుతున్నాయి. 

ఇదిలా ఉంటే అజిత్ ఫ్యాన్స్ అందర్నీ ఒకే తాటిపై కట్టేసి తిట్టడంతో డర్టీ కస్తూరి ఆంటీ అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి ఫ్యాన్స్ కు బుద్ధి చెప్పకుండా వెనకేసుకొస్తున్న వాళ్లు కూడా వెధవలే అంటూ కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు ధారాళంగా వ్యాపిస్తున్నాయి. ఎంత చేసినా కూడా ఇలా అమ్మ చెల్లి జోలికి మాత్రం వెళ్లకుండా ఉంటే బాగుండేదని కస్తూరిపై కూడా కౌంటర్స్ పడుతున్నాయిప్పుడు. మొత్తానికి ఈ రచ్చ ఇప్పుడు ఎక్కడ ముగుస్తుందో చూడాలిక.

More Related Stories