English   

తమన్నా దారిలోనే మరో బ్యూటీ

Poorna Raj Tarun
2020-09-26 13:32:22

ఒకప్పుడు హీరో అంటే హీరో రోల్ చేయాల్సిందే తగ్గేది లేదు..హీరోయిన్ అంటే హీరోయిన్ రోల్ చేయాల్సిందే తగ్గేదే లేదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మంచి ఫిజిక్ ఉన్న హీరోలు విలన్లు గా..చిన్న హీరోలు అయితే స్టార్ ల సినిమాలో అన్న, తమ్ముడు,ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్లు కూడా చేసేస్తున్నారు. ఇక హీరోయిన్ల మాటకొస్తే వాళ్ళు కూడా మంచి పాత్ర వస్తే ఏ రోల్ చేయడానికైనా సై అంటున్నారు. కానీ హీరోయిన్ లు ఐటమ్ సాంగుల్లో ఇతర పాత్రల్లో నటించడం చూసాం కానీ నెగిటివ్ పాత్రలో నటించడం చాలా అరుదు. ఇక ఇప్పుడు అది కూడా మెల్లి మెల్లిగా మొదలవుతుంది.

ఇప్పటికే మిల్కీబ్యూటీ తమన్నా నితిన్ హీరోగా నటిస్తున్న అందాదున్ రీమేక్ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాటలో నటి పూర్ణ కూడా అడుగులు వేస్తోంది. పూర్ణ తాజాగా లాంచ్ అయ్యిన రాజ్ తరుణ్ కొత్త సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో పూర్ణ థ్రిల్లింగ్ గా కనిపించనుందట. ఇక ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతోనే పూర్ణ ఈ సినిమాకు ఒకే చెప్పిందట. ఇదిలా ఉండగా పూర్ణ తెలుగులో అవును,సీమటపాకాయ్, రాజుగారి గది లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక రాజ్ తరుణ్ సినిమాలో పూర్ణ విలన్ రోల్ కి ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.

More Related Stories