English   

క్యాస్టింగ్ కౌచ్ మీద నటి ప్రగతి కామెంట్స్..వాళ్ళు నోరు విప్పరంటూ 

Actress Pragathi
2020-08-03 11:26:28

సినిమా అంటేనే రంగుల ప్రపంచం, అలాంటి రంగుల ప్రపంచంలో కావలిసింది ట్యాలెంట్ ఒక్కటే కాదు అదృష్టం కూడా. ఒక వ్యక్తికి ఒక సినిమా అవకాశం వచ్చింది అంటే ట్యాలెంట్ ఒక్క దానివలనే అని చెప్పలేం. అనుకోకుండా కొందరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. అలా వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకోవడమే కాక హిట్ కొడతారు. ఆ తర్వాత వారి నుండి మరో సినిమా వస్తుందని కూడా చెప్పలేము. అయితే ట్యాలెంట్, అదృష్టం ఎంత ఉన్నా కావాల్సింది క్యారెక్టర్. ఎప్పటి నుండో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం మీద మనం రకరకాల కధలు వింటూనే ఉన్నాం. కొందరు ఈ విషయం మీద ఉద్యమాలే చేశారు. అయితే తాజాగా ఈ విషయం మీద సీనియర్ నటి ప్రగతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రగతి అందులో అనేక విషయాల మీద తన వ్యూ చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్‌ మీద ఆమె స్పందిస్తూ.. పెద్ద హీరోయిన్లు, ఓ స్థాయికి వెళ్లిన హీరోయిన్లు ఎవ్వరూ కూడా క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతారని తమకు ఎప్పుడూ అలాంటివి ఎదరుకాలేదని చెబుతారని ఎవరైతే సక్సెస్ కాలేదో వారే ఎక్కువ ఈ కామెంట్స్ చేస్తారని చెప్పుకొచ్చింది. అమ్మాయి అందంగా ఉంటే అలాంటి ఫెవర్స్ అడుగుతారని అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలనేది వారి మీదే ఆధారపడి ఉంటుందని తెలిపింది. తనకూ ఇలాంటి సంఘటనలు ఎదురైతే అక్కడి నుంచి వెళ్లిపోవడమో, లేదా సినిమా నుంచి తప్పుకోవడం వంటివో చేస్తా, అలానే కొన్ని చేశానని కూడా ఆమె చెప్పుకొచ్చింది. 

More Related Stories