English   

కాంచన 3 నటి మీద లైంగిక వేధింపులు

 actress Ri Djavi Alexandra blackmailed and sexually harassed by a photographer
2019-04-25 20:20:12

ఇటీవల విడుదలైన లారెన్స్ హారర్ చిత్రం 'కాంచన-3'లో రష్యన్ నటి రి ద్జావి అలేక్సాండ్రా నటించిన సంగతి తెలిసిందే. ఆమె లారెన్స్ సరసన హీరోయిన్ గా నటించింది. తాజాగా ఆమె ఒక ఫోటోగ్రాఫర్ మీద లైంగికంగా వేధించిన ఆరోపణలు చేస్తూ చెన్నై పోలీసులకి ఫిర్యాదు చేయగా సదరు ఫోటోగ్రాఫర్, నటుడు రూపేష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆరోపణల ప్రకారం రూపేష్ కుమార్ అనే ఫోటో గ్రాఫర్ ని ఒక ఫోటో షూట్ కోసం కలిశానని, అయితే అతను తనతో గడపాల్సిందిగా కోరాడని, అలా చేయని పక్షంలో ఆమె ఫోటోలు మార్ఫ్ చేసి ఇంటర్నెట్ లో విడుదల చేస్తానని బెదిరించాడట, ఈ విషయం మీద ఆమె పోలీసులకి ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసిన చెన్నై పోలీసులు ఆ విషయం నిజమే అని నిర్ధారించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. రష్యాకి చెందిన ఆమె సినిమా అవకాశాల కోసం భర్త పిల్లలతో కలిసి చెన్నైకి మకాం మార్చింది.

 

More Related Stories