English   

మీడియా పై సురేఖ వాణి కూతురు ఫైర్..ఉన్నవి రాయండి

Actress Surekha Vani
2021-03-02 15:33:15

టాలీవుడ్ నటి సురేఖ వాణి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి అలరించింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోలతోనూ సురేఖ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా..అక్కగా..భార్యగా సురేఖ చేసిన యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎక్కువ సినిమాల్లో బ్రహ్మానందం కు భార్యగా నటించి మెప్పించింది. మరోవైపు సోషల్ మీడియాలో నూ సురేఖ వాణి ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ గ్లామర్ షోలో హీరోయిన్ లతో పోటీ పడుతూ ఉంటుంది. సురేఖ తన కూతురు సుప్రీత తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు..కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బుల్లి సెలబ్రెటీ అయ్యింది.

అయితే తాజాగా సుప్రీత సోషల్ మీడియాలో మీడియా పై మండి పడింది. కొత్త న్యూస్ లు క్రియేట్ చేయకుండా ఉన్న న్యూస్ లు రాయండి..డబ్బు కోసం వేరే వాల్ల పరువు ప్రతిష్ట దెబ్బ తీసే మీరు జర్నలిస్ట్ లా అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడేసింది. కానీ అసలు తనకు ఎందుకు కోపం వచ్చిందో సుప్రీత చెప్పలేదు. అయితే ఇటీవల సూరేఖ వాణి రెండో పెళ్లి పై కొన్ని వార్తలు వచ్చాయి..కూతురు కోసమే సురేఖ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపించాయి. ఈ వార్తకే సుప్రీత హర్ట్ అయ్యిందా లేదంటే ఇంకేమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

More Related Stories