English   

నెటిజన్ కామెంట్ పై తాప్సి ఘాటు రీప్లే

 Actress Taapsee
2020-11-27 11:02:05

దక్షిణాది సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సి పన్ను. సౌత్ లో అసలు సినిమాలు చెయ్యడం మానేసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది. గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాప్సి "రష్మీ రాకెట్" అనే సినిమాలో అథ్లెట్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను తాజగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే తాస్పీ "రష్మీ రాకెట్" పోస్టర్లపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. ఓ నెటిజన్ కామెంట్ స్క్రీన్ షాట్ ను తాప్సి పోస్ట్ చేసి ఘాటుగా రిప్లై ఇచ్చింది. "నీకు నటన రాదు..కొన్ని కథలనే ఎన్నుకొని సినిమాలు చేస్తున్నావు. ఫాల్తూ హీరోయిన్" అంటూ నెటిజన్ కామెంట్ చేసాడు. దీనిపై స్పందించిన తాప్సి "నేను సరికొత్త ప్రమాణాలను సృష్టించా..అవి నీకు అర్థం కావడం లేదా" అంటూ రీప్లే ఇచ్చింది.

More Related Stories