English   

మూడో పెళ్లి మోజులో సొంత కొడుకును కూడా పట్టించుకోని వనిత..

Vanitha Vijaykumar
2020-07-13 07:47:47

తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా మూడో పెళ్లి సంచలనంగా మారింది. ఇది జరిగి కూడా 15 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ రచ్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు మరోసారి వనిత పెళ్లి ఆసక్తికరంగా మారింది. దానికి కారణం ఆమె కొడుకు విజయ్ శ్రీహరి.. అంటే మొదటి భర్త నుంచి పుట్టిన కొడుకు అన్నమాట. ఈ కుర్రాడి వయసు 23 ఏళ్లు. తాజాగా తన తల్లి మూడో పెళ్లి చేసుకోవడంతో విజయ్ శ్రీహరి తీవ్ర మానసిక వేధనకు గురయ్యాడని తెలుస్తుంది. ఈ విషయం వనిత మొదటి భర్త ఆకాశ్ తన సన్నిహితులతో చెప్పుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. వనితా విజయ్ కుమార్ మొటి మొదటి పెళ్లి 2000 ఏడాదిలో జరిగింది. ఆమె తొలి భర్త తమిళ టెలివిజన్ రంగంలో నటుడిగా పరిచయమే. ఆ తర్వాత 2007లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన వనితకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మొదటి భర్తకు 2007లో విడాకులు ఇచ్చేసింది వనిత. 

వాళ్లిద్దరికి అమ్మాయి, అబ్బాయి సంతానం ఉన్నారు. అమ్మాయిని వనిత తీసుకొచ్చింది.. అబ్బాయిని ఆకాశ్‌ తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండో పెళ్లి మరొకర్ని చేసుకుని అతడితో కూడా విడాకులు తీసుకుంది వనిత. మధ్యలో మరొకరితో కొన్ని రోజులు సహజీవనం చేసింది వనిత. ఇప్పుడు తాజాగా పీటర్ పాల్ ను మూడో పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై వనిత మొదటి భర్త కొడుకు విజయ్ శ్రీహరి మాత్రం చాలా అప్సెట్ అయ్యాడని.. తల్లి తీరుతో తనేమాత్రం సంతోషంగా లేడని తెలుస్తుంది. అన్నిరకాల బంధాలను తెంచుకుని ఒక్కడే ఉంటున్నాడని.. అందరికీ దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నాడని విజయ్ తండ్రి ఆకాశ్ సన్నిహితులకు చెప్పుకుంటున్నాడు. మొత్తానికి తల్లి మూడో పెళ్లితో బాగా డిస్టర్బ్ అయ్యాడు ఈ కుర్రాడు.

More Related Stories