English   

అదా.. ఒంపుతో సంపేసిందిగా..!

Adah-Sharma
2018-06-28 17:53:55

అదాశ‌ర్మ‌కు ఇప్పుడు ఒక‌టే ప‌ని ఉంది. ఏ ఇండ‌స్ట్రీలోనూ పెద్ద‌గా ప‌ని లేక‌పోవ‌డంతో త‌న‌కు తానే ప‌నులు క‌ల్పించుకుంటుంది అదా. అదే అందాల ఆర‌బోత‌. అది కూడా మామూలుగా కాదు.. చూస్తుంటేనే సెగ‌లు పుట్టాలి. తాను ఏ ప‌నిమీదైతే ఫోక‌స్ చేసిందో.. అదే ప‌ని స‌రిగ్గా చేస్తుంది అదా. ఏ మాత్రం అందాల‌ను ఆదా చేయ‌కుండా అన్నీ ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ఎద అందాల్ని కూడా దాచుకోవ‌డం లేదు అదా. దానికితోడు న‌డుం సోయ‌గాలు కూడా ఓ రేంజ్ లో ఆర‌బోస్తుంది. ఈ మ‌ధ్యే బికినీ సోకులు కూడా కెమెరా ముందు ప‌రుస్తూ ప్రేక్ష‌కుల‌కు త‌న బ్యూటీతో హార్ట్ ఎటాక్ తెప్పించింది అదా. ఇక ఇప్పుడు మ‌రో హాట్ పోటోషూట్ చేసింది. ఇది చూసిన త‌ర్వాత కుర్రాళ్ల‌కు నిద్ర ప‌డితే ఒట్టు. బోన‌స్ గా హార్ట్ ఎటాక్ కూడా వ‌స్తుంది. త‌న ఒంపుల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది అదా. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో చిన్న రోల్ కావ‌డంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లోనూ అంతే. ఇక ఆదితో న‌టించిన గ‌ర‌మ్ ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అదా కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ దిమ్మ‌తిరిగే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాలి. కానీ ప‌రిస్థితి చూస్తే చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. అది రావాలంటే అందాలు ఎరేయాలి. దాంతో ఇదిగో ఇలా అందాల ఆర‌బోత‌తో కాలం వెల్ల‌దీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అందాల్ని చూసైనా ఏ ద‌ర్శ‌కుడో.. నిర్మాతో క‌రుణించ‌క‌పోతాడా అని అదా ఆశ‌.

More Related Stories