English   

నాని వి సినిమాలో ఆమె కూడా విలన్ అంట.. 

Aditi Rao Hydari
2020-04-08 15:59:32

నాని వి సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగానే వేచి చూస్తున్నారు. పైగా ఈ చిత్రంలో నాని పూర్తిస్థాయి విలన్ గా నటించడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే రావాల్సింది కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. అయినా ఈ రోజుల్లో మన హీరోలకు కథలు నచ్చితే ప్రతినాయక పాత్రలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా జై లవకుశ సినిమాలో విలన్ గా నటించాడు. అందుకే నాని కూడా కానిచ్చేసాడు. 

ప్రస్తుతం తన 25వ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణతో వి సినిమా చేసాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్, ఎంసిఏ సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు మూడోసారి దిల్ రాజుతో సినిమా చేస్తున్నాడు నాని. దానికి తోడు అది 25వ సినిమా కావడంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో నాని ప్రతినాయక పాత్రలో నటించాడు. 

ఇంద్ర‌గంటి మోహన కృష్ణ ఈ క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడని.. నాని కూడా తన కెరీర్ కు ప్రాణం పోసిన ఇంద్రగంటి మోహనకృష్ణ తోనే 25వ సినిమా చేయడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇందులో పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు నాని. నివేదా థామస్ కోసం నాని సైకోగా మారిపోతాడని తెలుస్తుంది. ఇంద్రగంటిపై నమ్మకంతో ఇంకో మాట మాట్లాడకుండా విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు నాని. ఇందులో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో అదితి రావు హైదరీ కూడా విలన్ గానే నటించిందని తెలుస్తుంది. ఈమె పాత్ర సినిమాకు మరో ట్విస్ట్ అంటున్నారు. ఏదేమైనా కూడా కరోనా అయిపోయిన తర్వాత వచ్చే తొలి పెద్ద సినిమా ఇదే అవుతుంది. మరి చూడాలిక.. నాని, అదితి విలన్ వేషాలు వి సినిమాను ఎంతవరకు గట్టెక్కిస్తాయో..? 

More Related Stories