English   

బికినీలో సెగ‌రేపిన తెలుగ‌మ్మాయి.. 

Aditi-Rao-Hydari

తెలుగమ్మాయిలు అంటే చాలు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అస్స‌లు ప‌ట్టించుకోరు. ఎప్పుడూ పొరుగింటి పుల్ల‌కూరే కావాలంటారు. కోట్ల‌కు కోట్లు ఇచ్చి అక్క‌డ్నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌కే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అవ‌కాశ‌మిస్తుంటారు. ఫ‌ర్ ఎగ్జాంపుల్.. అదితిరావ్ హైద్రీనే తీసుకోండి. ఈ భామ అచ్చ‌తెలుగ‌మ్మాయి. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. హైద్రాబాద్ నుంచే బాంబే వెళ్లింది అదితి. ఇక్క‌డ అవ‌కాశాలు లేక‌.. మోడలింగ్ చేసుకుంటూ బాలీవుడ్ వెళ్లింది ఈ బ్యూటీ. అక్క‌డ కొన్ని సినిమాలు చేసింది అదితి. కానీ క్రేజ్ రాలేదు. మొన్న మ‌ణిర‌త్నం చెలియా సినిమాలో న‌టించినా కూడా అది ఫ్లాపైంది. దాంతో ప‌రిస్థితి మ‌ళ్ళీ మొద‌టికి వ‌చ్చింది. అందుకే హాయిగా సినిమాల వైపు చూడ‌టం మానేసి.. హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది. బికినీ షోల‌తో మ‌తులు పోగొడుతుంది ఈ తెలుగ‌మ్మాయి. అన్న‌ట్లు తెలుగులో ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ స‌మ్మోహ‌నం సినిమాతో ఎంట్రీ ఇస్తుంది ఈ భామ‌. దానికితోడు మ‌ణిర‌త్నం త‌ర్వాతి సినిమాలోనూ అదితిని తీసుకున్నారు. మొత్తానికి ఈ అందాల వేడితోనే అవ‌కాశాలు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories