English   

తెలియని వ్యక్తితో అది చేయాల్సి వచ్చిందట 

  Aditi Rao Hydari
2019-05-21 15:03:15

స‌మ్మోహ‌నం, అంతరిక్షం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రి. ఆమె తన జీవితానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టింది. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారా అని అడిగితే అలాంటివి దాదాపుగా లేవని చెప్పింది. కానీ ‘ఏ సాలి జిందగీ’ సినిమా ఆడిషన్ లో నాకు అసలు తెలియని వ్యక్తితో దాదాపుగా ‘రోమాన్స్’ చేయాల్సి వచ్చిందట. తనకు అతనెవరో తెలియదని అతనేమో భారీకాయుడని ఏం జరుగుతోందో నాకేమీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆమె పేరు చెప్పలేదు కానీ అదితితో నటించిన వ్యక్తి అరుణోదయ్ సింగ్ అనే విషయం ఆ సినిమా చూసిన వారికి అర్ధం అవుతుంది. ఇక ఆమె తన చిన్ననాటి విషయాలు చెబుతూ 5 వ తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి ప్రేమలేఖ అందుకున్నానని తెలిపింది. ఆ రాసిన ఆయన ఎవరో కానీ అమ్మడు అందాన్ని వర్ణిస్తూ రెండు పేజీల కవిత్వం రాశాడట. 9 ఏళ్ళ వయసులో ప్రేమలేఖ అందుకున విషయం తలుచుకుంటే ఇప్పుడు అదోలా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే 21 ఏళ్ళ వయసులో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నానని అయితే తమ బంధం ఎక్కువకాలం సాగకపోవడంతో విడిపోయామని ఆ తర్వాత ఇప్పుడు సినిమాలతోనే ప్రేమలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.

More Related Stories