English   

రావే నా చెలియా.. రావే నా..!

Aditi-Rao
2018-04-11 15:14:14

తెలుగమ్మాయిలు అంటే చాలు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అస్స‌లు ప‌ట్టించుకోరు. ఎప్పుడూ పొరుగింటి పుల్ల‌కూరే కావాలంటారు. కోట్ల‌కు కోట్లు ఇచ్చి అక్క‌డ్నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌కే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అవ‌కాశ‌మిస్తుంటారు. ఫ‌ర్ ఎగ్జాంపుల్.. అదితిరావ్ హైద్రీనే తీసుకోండి. ఈ భామ అచ్చ‌తెలుగ‌మ్మాయి. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. హైద్రాబాద్ నుంచే బాంబే వెళ్లింది అదితి. ఇక్క‌డ అవ‌కాశాలు లేక‌.. మోడలింగ్ చేసుకుంటూ బాలీవుడ్ వెళ్లింది ఈ బ్యూటీ. అక్క‌డ కొన్ని సినిమాలు చేసింది అదితి. కానీ క్రేజ్ రాలేదు. మొన్న మ‌ణిర‌త్నం చెలియా సినిమాలో న‌టించినా కూడా అది ఫ్లాపైంది. సినిమా ఫ్లాప్ అయినా కూడా అవ‌కాశాలు మాత్రం ఇప్పుడు సౌత్డ్ నుంచి బాగానే వ‌స్తున్నాయి ఈ భామ‌కు. 

తెలుగులో సుధీర్ బాబు స‌ర‌స‌న స‌మ్మోహ‌నం సినిమాలో న‌టిస్తుంది అదితి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రంతో పాటు వ‌రుణ్ తేజ్-సంక‌ల్ప్ రెడ్డి సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది అదితి. ఒకేసారి రెండు సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు బికినీ షోల‌తో మ‌తులు పోగొడుతుంది ఈ తెలుగ‌మ్మాయి. దానికితోడు మ‌ణిర‌త్నం త‌ర్వాతి సినిమాలోనూ అదితిని తీసుకున్నారు. మొత్తానికి ఈ అందాల వేడితోనే అవ‌కాశాలు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories