English   

 సెగ‌లు పుట్టించిన అదితి రావ్.. 

Aditi-Rao-Hydari

అదితిరావ్.. ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఎక్కువ‌గానే వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా స‌మ్మోహ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది ఈ భామ‌. తెలుగమ్మాయిలు అంటే చాలు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అస్స‌లు ప‌ట్టించుకోరు. ఎప్పుడూ పొరుగింటి పుల్ల‌కూరే కావాలంటారు. కోట్ల‌కు కోట్లు ఇచ్చి అక్క‌డ్నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌కే మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు అవ‌కాశ‌మిస్తుంటారు. ఫ‌ర్ ఎగ్జాంపుల్.. అదితిరావ్ హైద్రీనే తీసుకోండి. ఈ భామ అచ్చ‌తెలుగ‌మ్మాయి. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. హైద్రాబాద్ నుంచే బాంబే వెళ్లింది అదితి. ఇక్క‌డి ప్ర‌ఖ్యాత వ‌న‌ప‌ర్తి సంస్థానాధీశురాలు ఈ భామ‌. రాజ‌వంశాలు ఇప్పుడు లేవు కాబ‌ట్టి అప్ప‌ట్లోనే వీళ్లు ముంబై వ‌ల‌స వెళ్లారు. ఇక అదితి కూడా అక్క‌డే ప్ర‌య‌త్నాలు చేసుకుంది. స‌క్సెస్ కూడా అయింది. మ‌ణిర‌త్నం చెలియాతో సౌత్ లో క్రేజ్ తెచ్చుకుంది. హాయిగా సినిమాల చేస్తూనే మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది. బికినీ షోల‌తో మ‌తులు పోగొడుతుంది ఈ తెలుగ‌మ్మాయి. ఇప్పుడు కూడా వోగ్ మ్యాగ‌జైన్ కోసం అందాల‌న్నీ ఆర‌బోసింది ఈ భామ‌. ఈ అందాల వేడితోనే అవ‌కాశాలు రాజేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది చూసిన త‌ర్వాతైనా స్టార్ హీరోలు ఆఫ‌ర్లు ఇస్తారేమో చూడాలిక‌..!


 

More Related Stories