English   

గూఢచారి లో ఇంత ఎమోషనా..?

Adivi Sesh Goodachari Trailer
2018-07-27 19:35:09

అడవి శేష్ హీరోగా రూపొందిన సినిమా గూఢచారి. వచ్చే నెల 3న విడుదల కాబోతోందీ సినిమా. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సుప్రియ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.  రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో ఆకట్టుకున్న గూఢచారి టీమ్.. ఈ శుక్రవారం సాయంత్రం ట్రైలర్ విడుదల చేసింది. ఇది ఊహించినట్టుగానే టీజర్ కు పూర్తి భిన్నంగా ఉంది. థ్రిల్స్ తో పూర్తి ఎమోషనల్ డ్రైవ్ లా కనిపిస్తోందీ సినిమా. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇది ‘రా’ఆఫీసర్ కు సంబంధించిన కథగా అర్థమౌతుంది. రా లో పనిచేసి చనిపోయిన తండ్రికి తనయుడుగా తనూ దేశరక్షణ విభాగంలో చేరే కొడుకు పాత్రలో అడవి శేష్ కనిపిస్తున్నాడు. అయితే సాధారణంగా పరిచయం అయిన పాత్రలన్నీ దాదాపు ఏదోరకంగా ఆ విభాగానికే సంబంధించినవి అయి ఉండటం ఈ ట్రైలర్ తో ప్రత్యేకత.

Goodachari Official Trailer

ఇక ప్రకాష్ రాజ్, శేష్ ఫాదర్ కు కొలీగ్ కనిపిస్తున్నాడు. సుప్రియ ఏదో రక్షణ విభాగానికి ఇంచార్జ్ లా ఉంది. మొత్తంగా తను దేశాన్ని కాపాడతా అని వెళ్లిన శేష్ తర్వాత కొన్ని డౌట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. మరి నిజంగా అతను దేశ రక్షణకే వెళ్లాడా లేక తన తండ్రిని వెదుక్కుంటూ వెళ్లాడా అనే క్రమంలో సాగే సినిమాలా కనిపిస్తోంది. అయితే గూఢచారిలో ఊహించినదానికంటే ఎక్కువగా ఎమోషన్స్ నిండి ఉంటాయనే హింట్ కూడా ఇచ్చిందీ ట్రైలర్. మరి ఆ ఎమోషన్స్ తో పాటు ఈ థ్రిల్స్ కూడా వర్కవుట్ అయితే గూఢచారి విజయం తథ్యం. శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈ గూఢచారి ఆగస్ట్ 3న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

More Related Stories