English   

గూఢచారితో రెజీనా రొమాన్స్ 

adivi-sesh-regina
2018-08-09 12:19:34

కొన్ని విజయాలను కాకతాళీయం అనలేం. అవి ఎంతో కష్టపడితే కానీ రావు. అందుకే ఆ కష్టపడేవారి కష్టం వృధా కాదు. ఈ విషయంలో అడవి శేష్ ను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సినిమాను పిచ్చిపిచ్చిగా ప్రేమించే కొద్దిమందిలో శేష్ ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఏదో సినిమా చేశాం అన్నట్టు కాకుండా ఆడియన్స్ కు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని తపిస్తుంటాడతను. ఇందుకు ఉదాహరణలే క్షణం, గూఢచారి. ఈ రెండు సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు శేష్. ఈ అభిమానులు అతనికి ప్రేక్షకుల్లోనే కాదు.. సినిమా ఇండస్ట్రీలోనూ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం గూఢచారి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న అడవి శేష్ గురించి.. లేటెస్ట్ గా ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది.

గూఢచారి సినిమా విడుదలకు ముందే అతను ఓ సినిమా కమిట్ అయి ఉన్నాడు. అది కంప్లీట్ గా యాక్షన్ థ్రిల్లర్ అట. ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనా కసాండ్రా నటిస్తోంది. అమ్మడు చాలాకాలం క్రితం నుంచే టాలీవుడ్ లో కనిపించడం మానేసింది. అంటే సినిమాలు హిట్ కాక, ఆఫర్స్ రావడం లేదనుకోండి. రీసెంట్ గా తమిళ్ లో చంద్రమౌళి అనే సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. కానీ ఆమె శ్రమంతా ఫ్లాప్ లో పోసిన బికినీలా అయిపోయింది. దీంతో అక్కడా ఆఫర్స్ కు ఇబ్బంది పడుతోన్న టైమ్ లో సడెన్ గా ఈ ఛాన్స్ వచ్చిందిట. 

అడవి శేష్ క్షణం చిత్రాన్ని నిర్మించిన పివిపి బ్యానరే ఈ చిత్రాన్నీ నిర్మించబోతోంది. ఈ సినిమాతో రామ్ జీ అనే కొత్త వ్యక్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో ఇప్పటికే ఎక్స్ పర్ట్ అనిపించుకున్న శేష్.. ఈ కొత్త కుర్రాడికీ కావాల్సినంత సాయం చేస్తాడనడంలో డౌటేం లేదు. మొత్తంగా గూఢచారి హిట్ కు ముందే ఇలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన శేష్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాడట. మరి ఈ సినిమాతో అయినా రెజీనాకు మరో బ్రేక్ వస్తుందేమో చూడాలి. 

More Related Stories