English   

శివసేనకు ఎదురెళ్తే ఇంతేనా.. కంగన ఆఫీస్ కూల్చివేతపై భిన్నాభిప్రాయాలు..

Kangana Ranaut
2020-09-10 16:25:45

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇన్ని రోజులు హాట్ షోతో పిచ్చెక్కించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన మాటలతో ఫైర్ పుట్టిస్తుంది. ముఖ్యంగా సుశాంత్ చనిపోయిన తర్వాత కంగన చేస్తున్న కామెంట్స్ శివసేన ప్రభుత్వాన్ని చాలా ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కొడుకును కూడా టార్గెట్ చేసి.. ఈ కేసులోకి లాగడంతో వాళ్లంతా ఒక్కసారిగా మండి పడుతున్నారు. కంగన రనౌత్ ఏకంగా ముంబై ద్రోహి అంటూ ముద్ర వేసారు. బిజేపీ అండ చూసుకుని ఇలా రెచ్చిపోతుందంటూ శివసేన నాయకులు కూడా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఆఫీస్ ను బీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలోనే కంగనా కార్యాలయం కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. ముంబైలోని కంగనా రనౌత్ ఆఫీస్ పై ఆకస్మిక దాడులు చేపట్టిన బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు.. సెప్టెంబర్ 8న ఆమె ఆఫీస్ కు స్టాప్ వర్క్ నోటీసులు అంటించారు. వెంటనే మరుసటి రోజు వచ్చి కూల్చివేత మొదలు పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగన ఆఫీస్ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించారు. దాంతో సెప్టెంబర్ 9న అధికారులు వచ్చి కార్యాలయం కూల్చివేత పనులను మొదలు చేశారు. కార్మికులు కూల్చివేస్తున్న దృశ్యాలను ట్విటర్ లో కంగనా షేర్ చేసింది. కూల్చివేత పనులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. శివసేనకు ఎదురెళ్లినందుకే ఈమెను టార్గెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కంగనకు సపోర్టుగా మెసేజ్ లు వస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతదూరం వెళ్తుందో చూడాలి. 

More Related Stories