English   

తెలుగు తెర‌పై మ‌రో చంట‌బ్బాయ్.. 

Agent-Sai-Srinivasa

డిటెక్టివ్ క‌థ అంటే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది జేమ్స్ బాండ్.. ఆ త‌ర్వాత తెలుగులో అయితే చంట‌బ్బాయ్. చిరంజీవి హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో క్లాసిక్ గా నిలిచింది. ఇక త‌ర్వాత కూడా కొన్ని డిటెక్టివ్ డ్రామాలు వ‌చ్చినా కూడా ఏది అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ఆ త‌ర్వాత ఆ జోన‌ర్ నే దూరం చేసుకున్నారు మ‌న హీరోలు. ఇక ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి డిటెక్టివ్ డ్రామా రాబోతుంది. అది కూడా గ‌తేడాది మ‌ళ్ళారావా లాంటి సెన్సిబుల్ సినిమా చేసిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ నుంచి ఈ చిత్రం రాబోతుంది. ప‌క్కా లోక‌ల్ డిటెక్టివ్ క‌థ‌తో ఈ చిత్రం రాబోతుంది. సాధార‌ణంగా పాండ్.. జేమ్స్ బాండ్ అంటారుగా.. అలాగే ఇక్క‌డ కూడా సాయి.. ఏజెంట్ సాయి.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అంటూ వ‌స్తున్నారు. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో శృతిశ‌ర్మ హీరోయిన్. జై చిరంజీవ‌లో చిరు చిన్న‌కోడ‌లుగా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. నెల్లూరు.. పెళ్లిళ్ల ఎంక్వయిరీలు చేస్తామనడం.. ఆషాఢం డిస్కౌంట్ సేల్ అని పేర్కొనడం.. పైగా ఆఫీసును ఓ మెకానిక్ దుకాణం లాంటి చోట పెట్టడం అన్నీ చూస్తుంటే,.. ఇలా పోస్ట‌ర్ లోనే ఇన్న హైలైట్ చేసారంటే క‌చ్చితంగా ఇది క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సినిమా అని అర్థ‌మైపోతుంది. కొత్త ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి డిటెక్టివ్ డ్రామాతో వ‌స్తోన్న ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలిక‌..!
 

More Related Stories