English   

ఆర్ఎక్స్ 100 రీమేక్..  టాప్ హీరో తనయుడుతో 

Ahan-Shetty
2018-09-24 19:52:30

ఓ సూపర్ హిట్ సినిమాను తమ వారసుల లాంచింగ్ కు వాడుకోవడం చాలాయేళ్ల నుంచీ నడుస్తోన్న ట్రెండే. అంటే ఓ భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో తమ వారసులతో రీమేక్ చేస్తుంటారన్నమాట. గతంలో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఇడియట్ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చిన కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇప్పుడక్కడ పవర్ స్టార్ అయ్యాడు. అలా చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ రీమేకులు మిస్ ఫైర్ అయి కనిపించకుండా పోయిన వారసులు కూడా ఉన్నారనుకోండి. ప్రస్తుతం తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. 

ఇదే వరసలో ఇప్పుడు మరో తెలుగు బ్లాక్ బస్టర్ తో ఓ బాలీవుడ్ వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తెలుగులో రీసెంట్ టైమ్స్ లో కల్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. ఈ సినిమా సాధించిన విజయం పరిశ్రమనే ఆశ్చర్యపరిచింది. సినిమా విజయంతో టాలీవుడ్ కు న్యూ టాలెంట్ కూడా పరిచయం అయింది. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో దర్శకుడుగా పరిచయం అయితే హీరో కార్తికేయకు రెండో సినిమాగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూ మంచి ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ లో ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ కాబోతోంది. ఇప్పుడు బాలీవుడ్ కూ వెళుతోంది. 

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సునిల్ శెట్టి తనయుడు ‘అహన్’ హీరోగా మారేందుకు ఈ కథనే ఎంచుకోవడం విశేషం. అహన్ ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్న నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా కూడా ఈ సినిమాకే ఓటేశాడు,. ఇప్పటికే ఇలాంటి కంటెంట్ ఉన్న బోల్డ్ మూవీస్ తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన మోహిత్ సూరిని ఈ చిత్రానికి దర్శకుడుగా ఎంచుకున్నారు. దీంతో ఈ బాలీవుడ్ రీమేక్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు. నిజానికి కొన్ని సీన్స్ విషయంలో మన దగ్గర పరిమితులున్నాయి కానీ.. అక్కడ లేవు కదా. బట్.. ఏదైనా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. 

More Related Stories